INDvsSL: ‘టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మది అద్భుతమైన ఎంట్రీ’

యర్ సునీల్ గవాస్కర్ ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు మ్యాచ్ పై స్పందించారు. తొలి సారి రెగ్యూలర్ కెప్టెన్ గా అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడని కొనియాడారు.

INDvsSL: ‘టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మది అద్భుతమైన ఎంట్రీ’

Sunil Gavaskar

INDvsSL: గ్రేట్ ఇండియన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు మ్యాచ్ పై స్పందించారు. తొలి సారి రెగ్యూలర్ కెప్టెన్ గా అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడని కొనియాడారు. టెస్టు సిరీస్‌లో తొలి ఇన్నింగ్స్ తోనే అద్భుతమైన విజయాన్ని కొట్టేసింది టీమిండియా. ఏకంగా 222 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

222 పరుగుల తేడానే కాదు రెండ్రోజుల ముందే మ్యాచ్ ముగించేసింది రోహిత్ సేన అని కొనియాడుతూ.. టెస్టు కెప్టెన్ గా ఎంట్రీతోనే అదరగొట్టేశాడంటూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నాడు.

ఇండియా అద్భుతంగా ప్రదర్శించి తొలి ఇన్నింగ్స్ లో 8వికెట్ల నష్టానికి 574పరుగులు చేసింది. శ్రీలంక రెండు ఇన్నింగ్స్ లలో 174, 178 పరుగులకే ఆల్ అవుట్ అయి చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా అజేయంగా 175పరుగులతో లంకపై మెరుపుదాడి చేశాడు.

Read Also: ‘జడేజాను చూసి రోహిత్ శర్మ భయపడే ఇలా చేశాడు’

‘కెప్టెన్‌గా రోహిత్ అరంగ్రేటం ఎక్స్‌లెంట్. మూడు రోజుల్లోనే గెలిచేశారు. దానిని బట్టే తెలుస్తుంది మీ టీమ్ సుపీరియర్ అని. ముఖ్యంగా ఇండియా ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులు ఆకట్టుకుంటున్నాయి. ఫీల్డర్లు ఉన్న చోటనే క్యాచ్ లు వచ్చాయి. పెద్దగా కదలాల్సిన పరిస్థితి కూడా రాలేదు. దీనిని బట్టే తెలుస్తుంది ఫీల్డింగ్ ఎక్కడ పెట్టాలో ఎంత తెలుసో’ అని సునీల్ గవాస్కర్ మీడియాతో చెప్పాడు.