IndVsWI 4th T20I : రాణించిన భారత బ్యాటర్లు.. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం

వెస్టిండీస్ తో నాలుగో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు తలోచేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. విండీస్‌కు 192 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.

IndVsWI 4th T20I : రాణించిన భారత బ్యాటర్లు.. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం

IndVsWI 4th T20I : వెస్టిండీస్ తో నాలుగో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు తలోచేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. విండీస్‌కు 192 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ (16 బంతుల్లో 33 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24 పరుగులు) జోడీ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించి శుభారంభం అందించింది. ఆ తర్వాత రిషబ్ పంత్ (31 బంతుల్లో 44 పరుగులు), దీపక్ హుడా (19 బంతుల్లో 21 పరుగులు) జోడీ స్కోరు బోర్డును ముందుకు ఉరికించింది.

చివర్లో సంజూ శాంసన్ (23 బంతుల్లో 30 పరుగులు నాటౌట్), అక్షర్ పటేల్ (8 బంతుల్లో 20 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడడంతో స్కోరు 190 పరుగుల మార్కు దాటింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, ఒబెద్ మెక్ కాయ్ తలో రెండు వికెట్లు తీశారు. అకీల్ హోసీన్ 1 వికెట్ తీశాడు.

192 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇంగ్లండ్ లో ఇంగ్లండ్ ను వన్డేల్లో, టీ20ల్లో మట్టి కరిపించి వెస్టిండీస్‌లో అడుగు పెట్టిన టీమిండియా.. ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలిచేసింది. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసి, 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక పొట్టి క్రికెట్లోనూ సిరీస్‌ అందుకోవడమే మిగిలింది. ఆ లక్ష్యంతోనే శనివారం నాలుగో టీ20లో బరిలోకి దిగింది. రెండో టీ20లో తడబడ్డా వెంటనే పుంజుకుని విండీస్‌పై ఘనవిజయం సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.

 

ఇండియా Vs విండీస్: