IndVsZim 1st ODI : తొలి వన్డేలో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం

జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. తొలుత జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భారత్... లక్ష్యఛేదనలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది.

IndVsZim 1st ODI : తొలి వన్డేలో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం

IndVsZim 1st ODI : జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. తొలుత జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భారత్… లక్ష్యఛేదనలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది.

టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మాన్ గిల్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ధావన్ 113 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు ఉన్నాయి. యువ ఆటగాడు గిల్ 72 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ లో 1-0తో భారత్ ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 20న జరగనుంది.

శుభ్ మాన్ గిల్ టాప్ ఇన్నింగ్స్..

టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు చెలరేగారు. దీపక్ చహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. దీంతో ఆతిథ్య జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది.

చెలరేగిన చహర్..

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ రెజిస్ చకబ్వా 35, రిచర్డ్ ఎన్గరవా 34, బ్రాడ్ ఇవాన్స్ 33 పరుగులతో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.