వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా.. భారత్‍‌కు తప్పని నిరాశ

వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా.. భారత్‍‌కు తప్పని నిరాశ

టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్‌కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం చెంది 85పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. అంచెలంచెలుగా ఎదిగి ఫైనల్స్‌కు చేరుకున్న టీమిండియా మహిళల జట్టు ట్రోఫీని ఉమెన్స్ డే రోజున చేజార్చుకోవడం బాధాకరం.

ఆసీస్ ఓపెనర్లు.. అలెస్సా హీలీ(75), బెత్ మోనీ(78)హిట్టింగ్‌తో చెలరేగిపోతే భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరు దీప్తి శర్మ(33)మాత్రమే. మిగిలిన వారిలో 20కి మించని స్కోరుతో వేద కృష్ణమూర్తి(19), రిచా ఘోష్(18), స్మృతి మంధాన(11)లు సరిపెట్టుకున్నారు. ఇటీవల రికార్డులతో చెలరేగి ఫుల్ ఫామ్‌లో కనిపించిన షఫాలీ వర్మ(2), తానియా భాటియా(2), జెమీమా రోడ్రిగ్స్(0), హర్మన్ ప్రీత్ కౌర్(4), శిఖా పాండే(1), రాధా యాదవ్(1), పూనమ్ యాదవ్(1), రాజేశ్వరీ గైక్వాడ్(1)లతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 

బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మకు 2వికెట్లు, పూనమ్ యావ్.. రాధా యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. భారత జట్టు ట్రోఫీ గెలవాలనే ఒత్తిడికి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన 86వేల 174మంది సాక్షిగా ఓటమి తప్పలేదు భారత జట్టుకు.