IPL: ఐపీఎల్లో 2013లో ఆ జట్టు చేసిన స్కోరే అత్యధికం.. ఇప్పటివరకు ఆ రికార్డు బద్దలు కాలేదు..

ఐపీఎల్ ద్వారా యంగ్ క్రికెటర్లు తమ సత్తా చాటుతున్నారు. క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2008లో తొలి ఐపీఎల్ జరిగింది. ఇప్పటివరకు 263 స్కోరు అత్యధిక స్కోరుగా ఉంది.

IPL 2008-2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టీ20 క్రికెట్లోని అసలు సిసలైన మజాను అందిస్తోంది. మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభమై దిగ్విజయంగా ఇప్పుడూ కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు నమోదైన స్కోర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) 2013 ఏప్రిల్ 23న చేసిన స్కోరే ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ (Highest Score in IPL)గా ఉంది. ఆ రోజున ఆర్సీబీ 263 పరుగులు చేసింది.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రికార్డును ఏ జట్టూ బద్దలు కొట్టలేదు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ లో అంత స్కోరు నమోదయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక స్కోర్లు చేసిన టాప్-10 జట్లు ఏవో చూద్దాం…

ఐపీఎల్లో టాప్-10 స్కోర్లు..

2013 ఏప్రిల్ 23న పూణే వారియర్స్ ఇండియాపై ఆర్సీబీ-263/5
2016 మే 14న గుజరాత్ లయన్స్ పై ఆర్సీబీ-248/3
2010 ఏప్రిల్ 3న రాజస్థాన్ రాయల్స్ పై సీఎస్కే 246/5
2018 మే12న పంజాబ్ కింగ్స్ పై కేకేఆర్ 245/6
2008 ఏప్రిల్ 19న పంజాబ్ కింగ్స్ పై సీఎస్కే 240/5
2015 మే 10న ముంబైపై ఆర్సీబీ 235/1
2021 అక్టోబరు 8న సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై 235/9
2021 మే 17న ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ 232/2
2019 ఏప్రిల్ 28న ముంబైపై కేకేఆర్ 232/2
2011 ఏప్రిల్ 23 పంజాబ్ కింగ్స్ పై అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ 231/4

IPL 2023, PBKS vs KKR: వర్షం అడ్డంకి.. D/L methodతో ఫలితం.. 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయ దుందుభి

ట్రెండింగ్ వార్తలు