శ్రేయాస్ అయ్యర్‌కు తలనొప్పిగా మారిన ఢిల్లీ గాయాలు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 మొదలైనప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్‌లలో గెలిచింది 3 మాత్రమే.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 11:46 AM IST
శ్రేయాస్ అయ్యర్‌కు తలనొప్పిగా మారిన ఢిల్లీ గాయాలు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 మొదలైనప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్‌లలో గెలిచింది 3 మాత్రమే.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 మొదలైనప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్‌లలో గెలిచింది 3 మాత్రమే. సీజన్‌ను విజయంతో ఆరంభించనప్పటికీ క్రమంగా పుంజుకుంటూ దూసుకుపోతోంది. ఈ సమయంలో ఢిల్లీని గాయాల బెడద పీడిస్తుంది. రాణిస్తారని ఆశించిని ప్లేయర్లంతా గాయాలతో జట్టు నుంచి దూరమవుతుంటే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు తలనొప్పిగా మారుతుంది. 
Read Also : 21వేల మంది చిన్నారులతో ముంబై ఇండియన్స్ మ్యాచ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో హర్షల్ పటేల్ కుడి చేతికి గాయం కావడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. దాని నుంచి కోలుకోవడానికి 3 నుంచి 4 వారాల సమయం పడుతుందని సమాచారం. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ గాయంతో బాధపడుతున్న మన్జోత్ కల్రాను శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆడించనుంది. 

జట్టు గాయాల బెడదను వివరిస్తూ.. హెడ్ కోచ్ అయిన రిక్కీ పాంటింగ్ ఇలా మాట్లాడాడు. ‘హర్షల్ పటేల్ ఏప్రిల్ 1న కింగ్స్ ఎలెవన్ తో ఆడిన మ్యాచ్ లో కుడిచేతి గాయానికి గురైయ్యాడు. వెంటనే ఎక్స్ రేలు తీయించాం. ప్రమాదం ఏమీ లేకపోయినా 3నుంచి 4వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అతనికి బదులుగా మన్జోత్ కల్రాను జట్టులోకి తీసుకుంటున్నాం’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. 

లీగ్‌లో ఇంతకుముందు ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఆడిన ఇరు జట్లు మరోసారి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పోరాడనున్నాయి. ఆ మ్యాచ్‌ చేధనలో అద్భుత ప్రదర్శన చేసిన ఢిల్లీ జట్టు సూపర్ ఓవర్లో రబాడ బౌలింగ్ వేయగా గెలుపొందింది.
Read Also : భారత్‌లో INDvAUS వన్డే మ్యాచ్.. ఎప్పుడంటే..