IPL 2020, CSK vs SRH live : చెన్నైపై హైదరాబాద్ విజయం

  • Published By: vamsi ,Published On : October 2, 2020 / 06:42 PM IST
IPL 2020, CSK vs SRH live : చెన్నైపై హైదరాబాద్ విజయం

[svt-event title=”చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం” date=”02/10/2020,11:55PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ IPL 2020లో 14వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు(02 అక్టోబర్ 2020) దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ జట్టు 7పరుగుల తేడాతో విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”6బంతుల్లో 28పరుగులు” date=”02/10/2020,11:19PM” class=”svt-cd-green” ] హైదరాబాద్‌తో జరగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి ఓవర్లో 26పరుగులు చెయ్యవలసి వచ్చింది. ఈ సమయంలో క్రీజులో ధోని, శామ్ కర్రన్ ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భూవీకి గాయం” date=”02/10/2020,11:14PM” class=”svt-cd-green” ] చెన్నైతో మ్యాచ్‌లో 19వ ఓవర్‌గా తన నాలుగో ఓవర్ వేస్తున్న భువనేశ్వర్ కుమార్‌కు గాయం అయ్యింది. దీంతో భువీ బదులుగా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌కు వచ్చాడు.[/svt-event]

[svt-event title=”10ఓవర్లలో 44పరుగులకే 4వికెట్లు” date=”02/10/2020,10:20PM” class=”svt-cd-green” ] సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. 10ఓవర్లు ముగిసేసరికి 165 పరుగుల టార్గెట్ చేధించే క్రమంలో చెన్నై జట్టు 44పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇక 60బంతుల్లో 121పరుగులు చెయ్యవలసి ఉంది. [/svt-event]

[svt-event title=”మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై” date=”02/10/2020,10:02PM” class=”svt-cd-green” ] 165పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆరు ఓవర్లకు 36పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. [/svt-event]

[svt-event title=”యువ ఆటగాళ్లు దుమ్ము లేపారు..” date=”02/10/2020,9:34PM” class=”svt-cd-green” ] చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అటువంటి సమయంలో యువ ఆటగాళ్లు ప్రియం గర్గ్‌-అభిషేక్‌ శర్మలు దుమ్ములేపారు. CSK బౌలింగ్‌కు బ్యాటింగ్‌తో సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ 76 పరుగులు పార్టనర్‌షిప్ చేశారు. అభిషేక్‌(31; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఐదో వికెట్‌గా అవుట్ అవగా.. ప్రియం గర్గ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. చివరివరకు క్రీజ్‌లో ఉన్న ప్రియం గర్గ్‌ 26 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌తో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అబ్దుల్‌ సామద్‌ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది. [/svt-event]

[svt-event title=”చెన్నై టార్గెట్ 165″ date=”02/10/2020,9:18PM” class=”svt-cd-green” ] ఐపీఎల్‌ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరుపున గార్గ్ మెరుపులు మెరిపించాడు. 26బంతుల్లో 51పరుగులు పూర్తి చేసి సన్‌రైజర్స్ జట్టు గౌరవప్రదమైన స్కోరుకు చేరుకునేలా చేశాడు. ఈ క్రమంలో చెన్నై జట్టుకు 165పరుగుల టార్గెట్ నిర్దేశించారు. [/svt-event]

[svt-event title=”గార్గ్ మెరుపులు.. హాఫ్ సెంచెరీ పూర్తి.. స్కోరు 157/5″ date=”02/10/2020,9:09PM” class=”svt-cd-green” ] ఐపీఎల్‌ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరుపున గార్గ్ మెరుపులు మెరిపించాడు. 24బంతుల్లో 50పరుగులు పూర్తి చేసి సన్‌రైజర్స్ జట్టు గౌరవప్రదమైన స్కోరుకు చేరుకునేలా చేశాడు. [/svt-event]

[svt-event title=”ఒకే ఓవర్‌లో వార్నర్, విలియమ్పన్ అవుట్” date=”02/10/2020,8:36PM” class=”svt-cd-green” ] IPL 2020లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ కష్టాల్లో ఇరుక్కుంది. వరుసగా రెండు మెయిన్ వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ స్కోరు చెయ్యడానికి కష్టపడుతుంది. వార్నర్, విలియమ్సన్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. [/svt-event]

[svt-event title=”రెండో వికెట్‌గా మనీష్ పాండే అవుట్” date=”02/10/2020,8:20PM” class=”svt-cd-green” ] ఐపీఎల్‌ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు వికెట్లు కోల్పోయింది. సన్‌రైజర్స్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 21 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో 29 పరుగులు చేసి పాండే అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”ఆచితూచి ఆడుతున్న హైదరాబాద్” date=”02/10/2020,8:00PM” class=”svt-cd-green” ] IPL 2020లో 14వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ జట్టు ఆరు ఓవర్లు ముగిసేసరికి 42పరుగులు చేసింది. వార్నర్, మనీష్ పాండే ఆచితూచి ఆడుతున్నారు.

[/svt-event]

[svt-event title=”ఫస్ట్ వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్” date=”02/10/2020,7:43PM” class=”svt-cd-green” ] మొదటి ఓవర్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క వికెట్ కోల్పోయింది. చాహర్ బౌలింగ్‌లో బెయిర్‌స్టౌ అవుట్ అయ్యాడు.  పరుగుల ఖాతా తెరవకుండానే బెయిర్‌స్టౌ అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”చెన్నై సూపర్ కింగ్స్ Playing XI :” date=”02/10/2020,7:06PM” class=”svt-cd-green” ] షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని (w/c), డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దుల్ ఠాకూర్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్ [/svt-event]

[svt-event title=”సన్‌రైజర్స్ హైదరాబాద్ XI:” date=”02/10/2020,7:05PM” class=”svt-cd-green” ] డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో (డబ్ల్యూ), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్ [/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన హైదరాబాద్” date=”02/10/2020,7:02PM” class=”svt-cd-green” ] ఐపీఎల్ 2020లో 14వ మ్యాచ్‌లో ‌టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని చెన్నైని ఫీల్డింగ్‌కి ఆహ్వానించింది. [/svt-event]

[svt-event title=”ఐపీఎల్‌లో ఎక్కువ గెలుపు శాతం ఉన్న జట్లు(10+ మ్యాచ్‌లు)” date=”02/10/2020,6:58PM” class=”svt-cd-green” ] 76.9శాతం MI vs KKR 75.0శాతం CSK vs SRH * 71.4శాతం SRH vs KXIP 68.2శాతం CSK vs DC 68.0శాతం KKR vs KXIP [/svt-event]

[svt-event title=”ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి” date=”02/10/2020,6:54PM” class=”svt-cd-green” ] దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చివరి ఆరు మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. [/svt-event]

[svt-event title=”హైదరాబాద్‌తో చివరి ఆరులో ఐదు మ్యాచ్‌లు గెలిచిన చెన్నై” date=”02/10/2020,6:50PM” class=”svt-cd-green” ] మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చివరి ఆరు మ్యాచ్‌లలో ఐదింటిని గెలిచింది. [/svt-event]

[svt-event title=”చివరి రెండు స్థానాల్లో చెన్నై, హైదరాబాద్:” date=”02/10/2020,6:46PM” class=”svt-cd-green” ] IPL 2020లో ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా చివరి నుంచి రెండవ ప్లేస్‌లో ఉంది. [/svt-event]

[svt-event title=”వాతావరణం: ” date=”02/10/2020,6:43PM” class=”svt-cd-green” ] దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో వాతావరణం ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఆటగాళ్ళు కూడా ఇక్కడ తీవ్రమైన వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది. దీనితో పాటు, మంచు కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గత ఆరు మ్యాచ్‌ల్లో ఇక్కడ రెండు మ్యాచ్‌లను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు.  [/svt-event]

[svt-event title=”పిచ్ రిపోర్ట్:” date=”02/10/2020,6:43PM” class=”svt-cd-green” ] షార్జా మరియు అబుదాబి క్రికెట్ స్టేడియంతో పోలిస్తే దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ స్టేడియం చాలా పెద్దది. అదే సమయంలో, ఇక్కడ పిచ్‌లో గడ్డి కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఫాస్ట్ బౌలర్లు ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో ఇరు జట్లు రంగంలోకి దిగవచ్చు. అయితే, ఇక్కడ గత 12 ఇన్నింగ్స్‌లలో 200 కంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి.

[/svt-event]

IPL 2020లో 14వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు(02 అక్టోబర్ 2020) రాత్రి 7:30 నుంచి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై తమ చివరి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోగా.. హైదరాబాద్ వారి చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్, చెన్నై జట్లు రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలవాలని గట్టిగా కష్టపడుతున్నాయి.



ఫస్ట్ మ్యాచ్ విన్నర్ ప్లేయర్ అంబటి రాయుడు, చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పూర్తిగా ఫిట్‌గా ఉండడం చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసి వచ్చే అంశం. రితురాజ్ గైక్వాడ్‌కు బదులుగా Playing XIలో ప్లేస్ అంబటి రాయుడుకు లభిస్తుంది. అదే సమయంలో, డ్వేన్ బ్రావోకు లుంగీ ఎంగిడి లేదా షేన్ వాట్సన్ కంటే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. తొలి మ్యాచ్‌లో గెలిచిన చెన్నై తదుపరి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది.



మరోవైపు, మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించింది. డేవిడ్ వార్నర్ గత మ్యాచ్‌లో గౌరవమైన స్కోరు చేసి ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. అతనితో పాటు, జానీ బెయిర్‌స్టో రెండు అర్ధ సెంచరీలు సాధించగా, కేన్ విలియమ్సన్ రాక జట్టును బలపరిచింది.