IPL 2020లో టైటిల్స్: అవార్డుల విన్నర్లు వీరే!

IPL 2020లో టైటిల్స్: అవార్డుల విన్నర్లు వీరే!

1. Emerging player of the season: దేవ్‌దత్ పడిక్కల్
తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో కదం తొక్కిన దేవ్‌దత్ పడిక్కల్ ఓవర్ నైట్ ఐపిఎల్‌లో ఆర్‌సీబీ హీరో అయిపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్‌.. ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌ల‌లో 473 ప‌రుగులు చేసి ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డును కైవసం చేసుకున్నాడు.



2. Fairplay award: ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians)
ముంబై ఇండియ‌న్స్ ఈసారి ట్రోఫీని గెలుచుకోవ‌డ‌మే కాదు, ఫెయిర్ ప్లే అవార్డును కూడా తన సొంతం చేసుకుంది. మైదానంలో జెంటిల్‌మెన్‌లా ప్రవర్తించే తీరుకు నిదర్శనంగా ఈ అవార్డును ఇస్తారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌కు గాను ఫెయిర్ ప్లే అవార్డు లభించింది.



3. Game-changer of the season: కేఎల్ రాహుల్(KL Rahul)
పంజాబ్‌ తెలుసుగా… 220 పైచిలుకు పరుగులు చేసి కూడా ఓడిన జట్టు.. సూపర్‌ ఓవర్‌లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. రెండు సూపర్ ఓవర్లు ఆడిన జట్టు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్‌ తొలి సగం మ్యాచ్‌ల్లో నిరాశపరిచి మిగిలిన సగం అయ్యాక రాణించింది. ఈ సీజ‌న్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు ప్రయత్నించిన కెప్టెన్ కేఎల్ రాహుల్.. బ్యాట్స్ మ‌న్‌గా స‌క్సెస్ అయ్యాడు. అతనికే గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది.



4. Super striker of the season: కిరన్ పొల్లార్డ్( Kieron Pollard)
ఐపీఎల్‌లో ఆడిన అన్నీ టీమ్‌లలో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్‌గా ఉన్న టీమ్ ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జట్టులో మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణంగా పోలార్డ్, హార్ధిక్ పాండ్యా. కిరన్ పొల్లార్డ్ మ్యాచ్‌లలో ప్రాణం పెట్టి ఫీల్డింగ్ చేస్తాడు. విజృంభించి బ్యాట్‌తో బాదేస్తాడు. పొల్లార్డ్ మొత్తం 16 మ్యాచ్‌ల‌లో 191.42 స్ట్రైక్ రేట్‌తో 268 ప‌రుగులు సాధించి సూప‌ర్ స్ట్రైక‌ర్ అవార్డును ఈ సీజన్‌లో సొంతం చేసుకున్నాడు.



5. Most sixes Award: ఇషాన్ కిష‌న్( Ishan Kishan)
ముంబై ఇండియ‌న్స్ ను అనేక మ్యాచ్‌ల‌లో విజ‌యాల బాట ప‌ట్టించిన వారిలో ఇషాన్ కిష‌న్ ఒకరు. కిష‌న్ మొత్తం ఈ సీజ‌న్‌లో 30 సిక్స్‌లు బాది మోస్ట్ సిక్సెస్ అవార్డ్ కైవసం చేసుకున్నాడు.



6. Power player of the season: ట్రెంట్ బౌల్ట్(Trent Boult)
ఐపీఎల్ ఫైన‌ల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు చెందిన కీల‌క వికెట్ల‌ను తీసిన బౌల్ట్ ముంబై విజ‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఇత‌ను ఈ సీజ‌న్ కు గాను ప‌వ‌ర్ ప్లేయ‌ర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ప‌వ‌ర్ ప్లేల‌లో ఇత‌ర జ‌ట్ల‌కు చెందిన కీల‌క వికెట్ల‌ను తీయడంలో ముంబై విజ‌యాల్లో ఇత‌ను ముఖ్య పాత్ర పోషించగా..అతనికి ఈ అవార్డు లభించింది.



7. Purple Cap: క‌గిసో ర‌బాడా(Kagiso Rabada)
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బెస్ట్ బౌలర్‌కు పర్‌పుల్ క్యాప్ అందజేస్తారు. టోర్నీ జరుగుతండగా అత్యధిక వికెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బౌలర్ మైదానంలో ఈ క్యాప్ ధరిస్తాడు. టోర్నీ ముగిసిన తర్వతా ఈ జాబితాలో టాప్‌లో నిలిచిన ప్లేయర్ బెస్ట్ బౌలర్ అవార్డుతో పాటు ఈ క్యాప్ అందజేస్తారు. ఈ సీజన్‌కు గాను ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు చెందిన ఫాస్ట్ బౌల‌ర్ క‌గిసో ర‌బాడాకు పర్‌పుల్ క్యాప్ దక్కింది. మొత్తం 17 మ్యాచ్‌ల‌లో 30 వికెట్లు తీసి ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డు సృష్టించాడు.



8. Orange Cap: కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2020 సీజ‌న్‌లో ఆరెంజ్ క్యాప్ కేఎల్ రాహుల్‌కు ద‌క్కింది. మొత్తం 14 గేమ్‌ల‌లో రాహుల్ 670 ప‌రుగులు చేసి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు.



9. Most Valuable Player: జోఫ్రా ఆర్చ‌ర్(Jofra Archer)
ఐపీఎల్ 2020 సీజ‌న్ మొత్తానికి అత్య‌ధిక విలువ క‌లిగిన ఆట‌గాడిగా రాజ‌స్థాన్ రాయల్స్ ప్లేయ‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ అవార్డు సాధించాడు. ఇత‌ను మొత్తం 20 వికెట్లు తీయగా.. సీజన్‌లో వ్యక్తిగతంగా అధ్భుతంగా రాణించిన వ్యక్తుల్లో ఆర్చర్ ఒకరు.