వీడియో: ఐపీఎల్‌లో ది బెస్ట్ ఇదే.. సిక్స్ బౌండరీలో సూపర్ మ్యాన్.. జాంటీ రోడ్స్, సచిన్ ప్రశంసలు

  • Published By: vamsi ,Published On : September 28, 2020 / 01:08 AM IST
వీడియో: ఐపీఎల్‌లో ది బెస్ట్ ఇదే.. సిక్స్ బౌండరీలో సూపర్ మ్యాన్.. జాంటీ రోడ్స్, సచిన్ ప్రశంసలు

ఐపీఎల్ 2020లో 9వ మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ మయాంక్ అగర్వాల్ చేసిన అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు వైపుల నుంచి బ్యాటింగ్‌లో పరుగుల వరద పారింది.

అదే సమయంలో, ఈ మ్యాచ్‌లో ఒక గొప్ప ఫీల్డింగ్ కూడా కనిపించింది. ఈ మ్యాచ్‌లో, రాజస్థాన్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో పంజాబ్ జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ గొప్ప ఫీల్డింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సచిన్ టెండూల్కర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్‌ను కూడా ఆశ్చర్యపరిచింది.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలో దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ దూకుడుగా ప్రతి బాల్‌ను సిక్స్‌కు తరలించే ప్రయత్నం చేసింది. అయితే ఈ మ్యాచులో కింగ్స్ లెవన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ నికోలస్ పూరన్ చేసిన ఫీల్డింగ్ అద్భుతం. ఇంకా చెప్పాలంటే.. ఐపీఎల్‌కే హైలైట్. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 8వ ఓవర్ మురుగన్ అశ్విన్ వేశాడు. ఆ సమయంలో సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ మంచి ఫామ్‌లో ఉన్నారు.

అశ్విన్ వేసిన రెండో బంతిని సంజు శాంసన్.. భారీ షాట్ ఆడగా.. సిక్స్ వెళ్లిందని అందరూ అనుకున్నారు. అయితే సిక్స్ వెళ్లే బంతిని పంజాబ్ ఫీల్డర్ నికోలస్ పూరన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. బంతి బౌండరీ దాటిన తర్వాత ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అందుకుని, ఇక బౌండరీల అవతల పడే సమయంలో బంతిని మళ్లీ ఫీల్డ్‌లోకి విసిరేశాడు. దీంతో ఆరు పరుగులు రావాల్సిన చోట రెండు పరుగులే వచ్చాయి. ఆ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అభిమానులు, మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో ఈ ఫీల్డింగ్‌పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది నా జీవితంలో చూసిన ఉత్తమ ఫీల్డింగ్’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. ‘నికోలస్ పూరన్ అద్భుత ఫీల్డింగ్‌పై పంజాబ్ జట్టు ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నికోలస్ పూరన్ క్యాచ్ చాలా అద్భుతంగా ఉంది. అతను గొప్ప ఫీల్డింగ్ చేశారు అని సచిన్ ట్వీట్ చేశాడు.