ఐపీఎల్ 2020: మరో రికార్డ్ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ

10TV Telugu News

ఐపీఎల్ 2020 ఐదవ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రోహిత్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ మరో రికార్డ్‌కు చేరువయ్యారు. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసిన రెండో వ్యక్తిగా రోహిత్ మారారు.


ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ ఐపిఎల్‌లో 194 సిక్సర్లు చేసి ఉన్నారు. రోహిత్ ఆరో సిక్స్ కొట్టిన వెంటనే ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు కొట్టిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ముందు క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్, ఎంఎస్ ధోని పేరిట ఈ రికార్డ్ ఉంది.ఐపీఎల్‌లో క్రిస్ గేల్ ఇప్పటివరకు 125 మ్యాచ్‌ల్లో 441 ​​పరుగులు చేసి 151 స్ట్రైక్ రేట్‌తో ఉన్నాడు. క్రిస్ గేల్ ఐపీఎల్‌లో మొత్తం 326 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న ఎబి డివిలియర్స్ ఐపిఎల్‌లో 4446 పరుగులు చేసి 155 మ్యాచ్‌ల్లో సగటున 40.5 పరుగులు చేశాడు. ఏబీకి లీగ్‌లో 214 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో ఎంఎస్ ధోని 192 ఐపిఎల్ మ్యాచ్‌ల్లో 42 సగటుతో 4461 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ధోనికి 212 సిక్సర్లు ఉన్నాయి.ఈ రికార్డ్ క్రియేట్ చేసిన నలుగురిలో గేల్, డివిలియర్స్ విదేశీయులు కాగా.. ధోనీ మాత్రమే భారత్ తరపున ఐపీఎల్‌లో ఈ రికార్డ చేశారు. ఇప్పుడు ధోనీ సరసన రోహిత్ చేరారు.