IPL 2020 SRH Vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

  • Published By: vamsi ,Published On : September 21, 2020 / 07:00 PM IST
IPL 2020 SRH Vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

IPL 2020 SRH vs RCB, Pitch & Weather Report and Match Preview: ఐపీఎల్-13 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండవ మ్యాచ్ నుంచే ఐపీఎల్‌లో హీట్ పెరిగిపోయింది. పోటాపోటీగా జట్లు సమరానికి సిద్ధం అయిపోయాయి. రెండో మ్యాచ్‌లో నువ్వా? నేనా? అన్నట్లుగా ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీ పడగా.. చివరకు సూపర్ ఓవర్ వరకు వెళ్లి ఢిల్లీ పంజాబ్‌పై విజయం సాధించింది.

ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో మూడవ మ్యాచ్‌కు మరో రెండు జట్లు సిద్ధం అయిపోయాయి. ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్.. చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగగా.. ఇప్పుడు మూడవ మ్యాచ్ సన్‌రైజర్స్ ఐపిఎల్ 2020లో మూడవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 నుంచి జరుగుతుంది.



ఈ సీజన్‌లో ఇరు జట్లకు తొలి మ్యాచ్ ఇది, కాగా విజయంతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించాలని రెండు జట్లు కూడా భావిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, రషీద్ ఖాన్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్ళు ఉండగా.. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, ఆరోన్ ఫించ్, డేల్ స్టెయిన్, క్రిస్ మోరిస్ వంటి మ్యాచ్ విజేతలు ఉన్నారు. రెండు జట్లలో యువ మరియు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడంతో రెండు జట్లపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

వాతావరణం:
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, అబుదాబి మాదిరిగానే, ఇక్కడ కూడా ఆటగాళ్ళు తీవ్రమైన వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక్కడ కూడా మంచు ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.



పిచ్ రిపోర్ట్:
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పిచ్‌లో గడ్డి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఇక్కడ ఫాస్ట్ బౌలర్లదే పెద్ద రోల్ ఉండవచ్చు. అదే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది, ఇందులో ఫాస్ట్ బౌలర్లు తమ ప్రభావాన్ని చూపించారు. పిచ్‌ను బట్టి, ఇరు జట్లు అదనపు ఫాస్ట్ బౌలర్‌ను జట్టులో ఉంచుకునే పరిస్థితి ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. Playing XI (అంచనా):
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్ మరియు సందీప్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. Playing XI (అంచనా):
ఆరోన్ ఫించ్, దేవదత్ పడికల్ / పార్థివ్ పటేల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డివిలియర్స్, మొయిన్ అలీ, శివం దుబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, ఉమేష్ యాదవ్ మరియు యుజ్వేంద్ర చాహల్.



మ్యాచ్ అంచనా:
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఫేవరేట్‌గా ఉంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తక్కువ అంచనా వెయ్యడానికి వీళ్లేదు. జట్టులో హిట్టర్లు ఎక్కువగా ఉన్నారు. స్కోర్లు మాత్రం భారీగానే నమోదయ్యే అవకాశం ఉంది.

SRH vs RCB Dream11 Team(అంచనా):
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రషీద్ ఖాన్ (వైస్ కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, దేవదత్ పాడికల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ నబీ, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, సందీప్ శర్మ