కోట్లు పెట్టి కొన్నారు.. కానీ.. కమిన్స్‌పై గరం.. సపోర్ట్‌గా కెప్టెన్!

  • Published By: vamsi ,Published On : September 24, 2020 / 01:39 PM IST
కోట్లు పెట్టి కొన్నారు.. కానీ.. కమిన్స్‌పై గరం.. సపోర్ట్‌గా కెప్టెన్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే, ఆటగాళ్ళు ఎక్కడ మెరుగుపడాలో గ్రహించినట్లు జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ అన్నాడు.

ఐపీఎల్‌ వేలంలో ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ను రూ. 15 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక బౌలర్‌కు అన్ని కోట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో పూర్తిగా విఫలం అయ్యాడు. మూడు ఓవర్లలోనే 4 సిక్సులు, మూడు ఫోర్లుతో సహా 49 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై కొల్‌కత్తా అభిమానులు గరం అవుతున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టంతో 195 పరుగులు చేసింది. కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్‌ను 49 పరుగుల తేడాతో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు పూర్తిగా విఫలం అయ్యారు.



ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం కార్తీక్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇటీవల వన్డే సిరీస్ నుంచి తిరిగి వచ్చారు. వారి క్వారంటైన్ పిరియడ్ బుధవారమే ముగిసింది. అందుకే కమిన్స్, మోర్గాన్ నేరుగా రావడం వల్ల సరిగ్గా ఆడలేకపోయారు. ఇప్పుడు ఉన్న వేడిలో ఆడడం అంత సులభం కాదని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డారు.


KKR 2012లో మొదటిసారి, 2014 లో రెండవసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకుంది. కానీ గత ఐదేళ్లుగా, జట్టు మూడవ టైటిల్‌ను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది.


ఈ సీజన్ కోసం, KKR ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్‌ని 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. కమిన్స్‌ ఐపిఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు. కోల్‌కతా తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 26న హైదరాబాద్‌తో తలపడనుంది. ఇక బౌలింగ్ విభాగంలో కమిన్స్ విఫలం అయినా కూడా బ్యాటింగ్ విభాగంలో పర్వాలేదు అనిపించారు. 12బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 33పరుగులు చేశాడు. జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.