IPL 2021: పర్‌ఫెక్ట్‌గా… పక్కా ప్లానింగ్‌తో కీలకమార్పులు

ఓవర్ల సంఖ్యను కుదించాల్సి వస్తే అప్పుడు ఒక్కో ఓవర్‌ను 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

IPL 2021: పర్‌ఫెక్ట్‌గా… పక్కా ప్లానింగ్‌తో కీలకమార్పులు

ipl-2021

IPL 2021: థర్డ్ అంపైర్ నిర్ణయమే అంతిమమైనదిగా పేర్కొంటూ ఇటీవల భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య టి20 సిరీస్‌ సందర్భంగా ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ను ఈ ఐపీఎల్‌లో పక్కనబెట్టేశారు. ఫీల్డ్‌ అంపైర్లు సందేహాస్పద నిర్ణయాలను థర్డ్‌ అంపైర్‌ కు నివేదించినప్పుడు స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు ఈ ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’అడ్డుకాబోదు. తనకు నివేదించిన అప్పీలుపై థర్డ్‌ అంపైర్‌దే తుది నిర్ణయం అవుతుంది.

పరుగుల లెక్క పారిపోదు
ఐపీఎల్‌ 2020లో పరుగు కొరత పంజాబ్‌ కింగ్స్‌ను నిండా ముంచేసింది. ఫీల్డ్‌ అంపైర్ల తప్పిదం పరుగుల కొరతకు దారితీసింది. దీనిపై ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ఐపీఎల్‌ పాలకమండలికి ఫిర్యాదు చేయడంతో థర్డ్‌ అంపైర్‌య ఉండాలని నిర్ణయించారు. దీంతో ఇక ప్రతీ పరుగు లెక్క ఇక పక్కాగా ఉంటుంది.

టీవీ అంపైర్‌కు నోబాల్‌…
మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసిన ఘటనలో నో బాల్ వివాదాస్పదం అవుతోంది. ఫీల్డ్ అంపైర్లను నోబాల్‌ దోషిగా నిలబెడుతోంది. ఈ పద్ధతిని దూరం చేయాలని నిర్ణయించిన పాలకమండలి టీవీ అంపైర్‌ దీనిపై సమీక్షించే అధికారాన్ని కట్టబెట్టింది.

సూపర్ ఓవర్ సరైన టైంలో
సూపర్‌ ఓవర్‌కు నిర్దేశిత సమయం ఉంది. గతంలో ‘టై’ అయితే సూపర్‌ ఓవర్‌ ఆడించేవారు. అక్కడా సమమైతే ఇంకో ఓవర్, అలా విన్నర్ తేలకపోతే మరో ఓవర్‌ ఉండేది. అలా ఇకపై సాగదు. ఏదేమైనా సూపర్‌ ఓవర్లు గంట దాటడానికి వీల్లేదు. నిర్ణీత 20 ఓవర్ల కోటా అంటే 40వ ఓవర్‌ ఆఖరి బంతి ముగిసే సమయం నుంచి ఈ గంట మొదలవుతుంది.

ఇన్నింగ్స్ మొత్తం 90 నిమిషాల్లోనే
ఐపీఎల్‌ టి20 మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు గంటన్నరలో పూర్తి చేయాల్సిందే.. గంటకు కనీసం 14.11 ఓవర్లు నమోదు కావాల్సిందే. ప్రతీ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లను 90 (85 నిమిషాలు+5 నిమిషాలు టైమ్‌ అవుట్‌) నిమిషాల్లోనే కచ్చితంగా పూర్తి చేయాలి. ఇతర కారణాలతో ఓవర్ల సంఖ్యను కుదించాల్సి వస్తే అప్పుడు ఒక్కో ఓవర్‌ను 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.