IPL 2021 CSK Vs DC ఉత్కంఠపోరులో చెన్నైపై ఢిల్లీదే గెలుపు

ఐపీఎల్ 14వ సీజన్ సెకండాఫ్ లో భాగంగా రెండు మేటి జట్లు ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

IPL 2021 CSK Vs DC ఉత్కంఠపోరులో చెన్నైపై ఢిల్లీదే గెలుపు

Ipl 2021 Csk Vs Dc

IPL 2021 CSK Vs DC : ఐపీఎల్ 14వ సీజన్ సెకండాఫ్ లో భాగంగా రెండు మేటి జట్లు ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 137 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.

Android Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..

ఢిల్లీ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్(35 బంతుల్లో 39 పరుగులు) రాణించాడు. చివర్లో హెట్ మెయిర్ (18 బంతుల్లో 28 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీకి విజయాన్ని కట్టబెట్టాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. దీపక్ చాహర్, హేజిల్ వుడ్, బ్రావో తలో వికెట్ తీశారు.

Shimron Hetmyer

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. పెద్ద స్కోర్ కాకపోవడంతో ఢిల్లీ విజయం చాలా ఈజీ అని అంతా అనుకున్నారు. కానీ, చివరి ఓవర్ వరకు మ్యాచ్ సాగింది. ఢిల్లీకి గెలుపు అంత ఈజీగా దక్కలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇక వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న చెన్నైని అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. రాయుడు 43 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో చెన్నై ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(13), డుప్లెసిస్(10) నిరాశపరిచారు. రాబిన్ ఊతప్ప(19) తొందరగానే ఔటయ్యాడు. మోయిన్ అలీ(5) విఫలం అయ్యాడు. కెప్టెన్ ధోని(18) పర్లేదనిపించాడు.

Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

ఐపీఎల్‌ 14వ సీజన్‌ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు చేసుకోగా ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే టాప్‌లో నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక పోరులో తలపడ్డాయి. ఇప్పటి వరకు చెరో 18 పాయింట్లతో ఈ రెండు జట్లు కొనసాగాయి. చెన్నై పై గెలుపుతో ఢిల్లీ పాయింట్ల జాబితాలో టాప్ కి చేరింది.

Shardul Thakur

గతేడాది పేలవ ఆటతీరుతో విఫలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెలరేగిపోతోంది. వరుస విజయాలతో అగ్రస్థానంలో కొనసాగిన ధోనీసేన.. తనతో సమానంగా ఉన్న ఢిల్లీ చేతిలో ఓడింది. దీంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లేముందు మరింత ఆత్మవిశ్వాసం పొందాలని భావించగా నెరవేరలేదు. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌తోనూ ఓటమిపాలైంది.

ఇక ఢిల్లీ గతేడాదిలాగే ఈసారి కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ధోనీసేనతో సమానంగా పోటీపడుతోంది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనే ఆ జట్టు బ్యాటింగ్‌ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో 127 పరుగులే చేసిన ఆ జట్టు ముంబయితో ఆడిన గత మ్యాచ్‌లోనూ 130 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లింది. మొత్తంగా చెన్నైతో రసవత్తర పోరులో గెలిచి ఢిల్లీ కేపిటల్స్ ఆధిపత్యం చెలాయించింది.

స్కోర్లు..
చెన్నై- 136/5
ఢిల్లీ – 139/7 (19.4ఓవర్లు)