IPL 2021 CSK vs MI : ముంబైని చిత్తు చేసిన చెన్నై

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశలో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై చెన్నై గెలిచింది. 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధిం

IPL 2021 CSK vs MI : ముంబైని చిత్తు చేసిన చెన్నై

Csk Won On Mumbai

IPL 2021 CSK vs MI : ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశలో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబైకు చెన్నై ఝలక్ ఇచ్చింది. 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యామ్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. 157 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై జట్టు.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై జట్టులో సౌరబ్ తివారీ హాఫ్ సెంచరీతో(40 బంతుల్లో 50 పరుగులు) ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. హేజిల్ వుడ్, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.

Viral Video : ఈ వీడియో చూస్తే ఇంక బేకరీ ఫుడ్ తినరు–పిచ్చి చేష్టలు చేస్తున్న బేకరి వర్కర్లు

ఈ మ్యాచ్ లో టాస్ గెల్చిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై బ్యాట్స్ మెన్ తడబడ్డారు. 24 పరుగులకే 4 వికెట్లో కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాజ్ చెలరేగాడు. ఆకాశమే హద్దుగా ఆడాడు. 58 బంతుల్లోనే 88 పరుగులు బాదాడు. దీంతో చెన్నై జట్టు 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగలిగింది. పెద్ద స్కోర్ కాకపోయినా ముంబై బ్యాట్స్ మెన్ చేధించలేకపోయారు. చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ లేని కారణంగా ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. కీరన్ పొలార్డ్ కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు. క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చింది. ఐపీఎల్-14 భారత్ లో సగంలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఐపీఎల్ ఆగిపోగా, మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో నిర్వహిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 16,2021) తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు దుబాయ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు కీరన్ పొలార్డ్ నాయకత్వం వహించాడు. ముంబై జట్టులో అన్మోల్ ప్రీత్ సింగ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.