IPL 2021 CSK vs MI : నిప్పులు చెరిగిన ముంబై బౌలర్లు.. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై

ఐపీఎల్ రెండో సెషన్ ప్రారంభంలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గె

IPL 2021 CSK vs MI : నిప్పులు చెరిగిన ముంబై బౌలర్లు.. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై

Ipl 2021 Csk Vs Mi

IPL 2021, CSK vs MI : ఐపీఎల్ రెండో సెషన్ ప్రారంభంలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై బౌలర్లు నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. చెన్నై ఓపెనర్ డుప్లెసిస్ జట్టుకు శుభారంభం అందించలేకపోయాడు. ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు.

Mother Drink Urine : గుండెలు పిండే విషాదం.. తన మూత్రం తానే తాగిన తల్లి

ఆ తర్వాత వచ్చిన మొయీన్ అలీ (0) కూడా ఒక్క పరుగూ చేయకుండానే ఔట్ అయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం ఎన్నో అంచనాలతో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా 6 బంతులు ఎదుర్కొని 4 పరుగులే చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ధోనీ కూడా 3 పరుగులకే ఆడమ్ మిల్నెకు వికెట్ సమర్పించుకున్నాడు.

Online Auction : ఒక్క రూపాయి ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..ఒక్క నాణెం మిలియనీర్‌‌ను చేసింది

న్యూజిల్యాండ్ బౌలింగ్ ద్వయం ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నె తొలి పవర్‌ ప్లేలో విజృంభించారు. చెన్నై కోల్పోయిన నాలుగు వికెట్లను వీళ్లిద్దరే తీశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నై జట్టును యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.

క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చింది. ఐపీఎల్-14 భారత్ లో సగంలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఐపీఎల్ ఆగిపోగా, మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో నిర్వహిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 16,2021) తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు దుబాయ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు కీరన్ పొలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు. ముంబై జట్టులో అన్మోల్ ప్రీత్ సింగ్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇరు జట్ల బలాబలాలు చూస్తే… ముంబయి జట్టులో రోహిత్ లేకపోయినా డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్ రూపంలో భారీ హిట్టర్లున్నారు. బౌలింగ్ లోనూ ఆ జట్టుకు అద్భుతమైన వనరులున్నాయి. ప్రపంచ ఉత్తమ పేసర్లుగా పరిగణించే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లతో ముంబయి బౌలింగ్ పటిష్టంగా ఉంది.