IPL 2021: ముంబైతో చెన్నై.. మాజీ కెప్టెన్ వర్సెస్ వైస్ కెప్టెన్

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు సిద్ధమైపోయాయి. కరోనా దృష్ట్యా ఇండియాలో జరగాల్సిన టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది బీసీసీఐ.

IPL 2021: ముంబైతో చెన్నై.. మాజీ కెప్టెన్ వర్సెస్ వైస్ కెప్టెన్

Csk Vs Mi

IPL 2021: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు సిద్ధమైపోయాయి. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాజీకెప్టెన్.. టీమిండియా వైస్ కెప్టెన్ ప్రత్యర్థులుగా తలపడనున్నారు.  కరోనా దృష్ట్యా ఇండియాలో జరగాల్సిన టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలో జరగాల్సిన 31మ్యాచ్ లతో టైటిల్ ఎవరికి దక్కుతుందో చూడాలి. అక్టోబర్‌‌ 8 వరకు లీగ్‌‌ మ్యాచ్‌‌లు షెడ్యూల్‌‌ చేయగా.. 10, 11, 13వ తేదీల్లో ప్లే ఆఫ్స్‌‌, 15న దుబాయ్‌‌లో ఫైనల్‌‌తో మెగా లీగ్‌‌ ముగుస్తుంది.

ఏప్రిల్‌‌–మేలో కరోనా అడ్డొచ్చే వరకూ మెగా లీగ్‌‌లో 29 మ్యాచ్‌‌లు జరగ్గా.. బిజీ ఇంటర్నేషనల్‌‌ షెడ్యూల్‌‌లోనూ మిగతా 31 మ్యాచ్‌‌లను బీసీసీఐ యూఏఈకి షిఫ్ట్‌‌ చేసింది.
ప్రస్తుత సీజన్ అయిన 14వ దానిలో ఫస్టాఫ్‌ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్​ కింగ్స్​ 8 మ్యాచ్‌‌లు ఆడేశాయి. మిగతా 6 జట్లు ఏడేసి మ్యాచ్‌‌లు మాత్రమే ఆడాయి. ఇప్పటివరకూ ముగిసిన టోర్నీని బట్టి ఢిల్లీ 6 విక్టరీలతో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించగా.. పోటాపోటీగా ఆడిన చెన్నై, బెంగళూరు చెరో 5 విక్టరీలతో 2,3 ప్లేసు‌ల్లో ఉన్నాయి. ముంబై నాలుగో ప్లేస్‌‌లో ఉండగా.. రాజస్థాన్‌‌, పంజాబ్‌‌, కోల్‌‌కతా, సన్‌‌రైజర్‌‌ చివరి 4 స్థానాల్లో నిలిచాయి.

ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌, పాండ్యా బ్రదర్స్‌, బుమ్రా, బౌల్ట్‌ కీలకంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం సీనియర్ ప్లేయర్లపైనే ఆశలు పెట్టుకుంది. ఇన్ని రోజులుగా ఆటకు దూరంగా ఉన్న ధోనీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఇమ్రాన్‌ తాహిర్‌ ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉంది. ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ అందుబాటులో లేకపోవడం చెన్నైకి లోటుగా కనిపిస్తుండగా.. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై ఆ జట్టు చాలా ఆశలు పెట్టుకుంది.

Balapur Laddu 2021 : బాలాపూర్ లడ్డూను సీఎం జగన్‌కు కానుకగా ఇస్తాం

టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు ముంబై పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో మెరవాలని భారత అభిమానులు ఆశిస్తుంటే.. సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ చాహర్‌ ఎంపికకు న్యాయం చేయాలని ఉత్సుకతతో కనిపిస్తున్నారు.

వరల్డ్‌‌కప్‌‌కు అన్ని దేశాలు వారి జట్లను ప్రకటించేశారు. అయితే, గాయాల కారణంగా చివర్లో ఏమైనా మార్పులు చేసేందుకు అక్టోబర్‌‌ 10 వరకు ఐసీసీ గడువు ఇవ్వడంతో ఐపీఎల్‌‌ పెర్ఫామెన్స్‌‌తో ఆ అవకాశం కొట్టేయాలని ఇండియన్స్‌‌తో పాటు విదేశీ ప్లేయర్లు భావిస్తున్నారు.

Balapur : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర

తుది జట్లు (అంచనా)
చెన్నై: ధోనీ (కెప్టెన్‌), గైక్వాడ్‌, అంబటి రాయుడు, అలీ, రైనా, జడేజా, బ్రేవో, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, తాహిర్‌, ఎంగ్డీ.
ముంబై: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌, మిల్నే, రాహుల్‌ చాహర్‌, బౌల్ట్‌, బుమ్రా.