IPL 2021 DC Vs KKR.. ఢిల్లీ జోరుకు బ్రేక్.. కోల్‌కతా విజయం

ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ క

IPL 2021 DC Vs KKR.. ఢిల్లీ జోరుకు బ్రేక్.. కోల్‌కతా విజయం

Kolkata Beats Delhi Capitals

IPL 2021 DC Vs KKR ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా.. 18.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

కోల్ కతా జట్టులో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 33 బంతుల్లో 30 పరుగులతో రాణించాడు. నితీష్ రానా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో పరుగులు చేశాడు. చివరలో సునీల్ నరైన్ బ్యాట్ ఝళిపించాడు. 10 బంతుల్లో 21 పరుగులు బాదాడు. దీంతో కోల్ కతా విక్టరీ కొట్టింది. లక్ష్యం పెద్దది కాకపోయినా.. చేజ్ చేసేందుకు కోల్ కతా బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ బ్యాట్స్ మెన్ విఫలమైనా.. బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆఖర్లో వికెట్లు తీసి కోల్ కతా బ్యాట్స్ మెన్ కు చెమట్లు పట్టించారు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు తీశాడు.

వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ జోరుకు కోల్‌కతా బ్రేక్‌ వేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులే చేసింది.

Bamboo Plants : ఎకరం భూమి.. ఏడేళ్లలో రూ.17లక్షల ఆదాయం.. ఆ రైతు ఏం పండించాడంటే

 

స్టీవ్‌ స్మిత్‌(39.. 34 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (39.. 36 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. 5వ ఓవర్‌లో ఢిల్లీ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ‌(24.. 20 బంతుల్లో 5 ఫోర్లు)ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేశాడు. తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(1)ని సునీల్‌ నరైన్‌ పెవిలియన్ చేర్చాడు.
ప్రమాదకరంగా మారుతున్న స్మిత్‌ని ఫెర్గూసన్‌ ఔట్‌ చేశాడు. హెట్‌మయర్ (4), లలిత్‌ యాదవ్‌(0), అక్షర్ పటేల్‌(0), అశ్విన్‌(9) నిరాశపరిచారు.

కోల్‌కతా బౌలర్లలో నరైన్‌, ఫెర్గూసన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సౌథీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకు వెళ్లింది కోల్ కతా.