Rishabh Pant: రషీద్ బౌలింగ్‌లో పంత్ బ్యాట్ ఎగిరిపోయింది

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్ ఎగిరిపోయింది. ఈ విషయం పంత్ కూడా కొన్ని క్షణాల పాటు తెలుసుకోలేకపోయాడు.

Rishabh Pant: రషీద్ బౌలింగ్‌లో పంత్ బ్యాట్ ఎగిరిపోయింది

Rishabh Pant

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్ ఎగిరిపోయింది. ఈ విషయం పంత్ కూడా కొన్ని క్షణాల పాటు తెలుసుకోలేకపోయాడు. ఐపీఎల్ 2021 లీగ్ సెకండాఫ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి సారి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడింది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంత్ బ్యాట్ గ్రిప్ కోల్పోయాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన బాల్‌ను ఎదుర్కోబోయిన పంత్.. కాస్త ఆవేశపడ్డాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 15వ ఓవర్ బౌలింగ్ వేస్తున్న రషీద్.. వికెట్ పడగొట్టాలనే కసి మీద ఉంటే.. రషీద్ వేసిన బంతిని అగ్రెసివ్ గా కట్ షాట్ గా హిట్ చేయాలని యత్నించాడు పంత్. సాహా ఆశగా స్టంప్ల వెనుక ఎదురుచూస్తుండగా బాల్ మిస్ అవడమే కాకుండా బ్యాట్ గ్రిప్ కోల్పోయాడు పంత్.

ఈ లోపే బంతిని అందుకోవడంతో అవుట్ అంటూ రషీద్ అరిచి బాల్ మిస్ అయిందని తెలిసి సైలెంట్ అయిపోయాడు. ఇక మిడివికెట్ దిశగా గాల్లోకి ఎగిరి కాస్త దూరంలో పడిన బ్యాట్‌ను కేన్ విలియమ్స్న్ అందుకుని తెచ్చి ఇవ్వడంతో పంత్ నవ్వుకుంటూ వచ్చేశాడు. ఈ సీన్ మొత్తాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఐపీఎల్ అభిమానులు నవ్వుకుంటున్నారు.

ఆల్‌రౌండ్ షో చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన 135 పరుగల టార్గెట్‌ను కేవలం 17.5 ఓవర్లలో ఛేదించారు. శ్రేయాస్ అయ్యర్ (47 నాటౌట్), రిషబ్ పంత్ (35 నాటౌట్)ల 67పరుగుల భాగస్వామ్యం జట్టుకు బలంగా మారింది.

 

…………………………………సన్‌రైజర్స్ ఆటగాడు నటరాజన్‌కు కరోనా పాజిటివ్