IPL 2021: ఫైనల్ కోసం పోరాటం – గెలిచేదెవరు.. నిలిచేదెవరు??

గురు శిష్యులిద్దరూ.. జార్ఖండ్ డైనమేట్లే. వరుసగా మూడో సీజన్లోనూ ప్లే ఆఫ్ కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వైపు, గతేడాది ప్లేఆఫ్ కు కూడా చేరుకోలేని చెన్నై సూపర్ కింగ్స్ పరాభవం.

10TV Telugu News

IPL 2021: గురు శిష్యులిద్దరూ.. జార్ఖండ్ డైనమేట్లే. వరుసగా మూడో సీజన్లోనూ ప్లే ఆఫ్ కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వైపు, గతేడాది ప్లేఆఫ్ కు కూడా చేరుకోలేని చెన్నై సూపర్ కింగ్స్ పరాభవం మరోవైపు. లీగ్ స్థాయి బట్టి ప్లేఆఫ్స్ కు చేరుకోగా తొలి మ్యాచ్ ను ఆదివారం అక్టోబర్ 10న ఢిల్లీ.. చెన్నైలు ఆడనున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ లో రిషబ్ పంత్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్ లతో పాటు కగిసో రబాడ, నార్ట్జే, హెట్మేయర్ లు కలిసి జట్టు పటిష్ఠంగా ఉంది. ప్రస్తుత సీజన్లో భారీ చేజింగ్ లతో తర్వాత బౌలింగ్ సైడ్ మంచి పట్టు కనిపిస్తుంది. నార్ట్జే, రబాడ, ఆవేశ్ ఖాన్ లు బ్యాట్స్‌మెన్‌ అంచనాలకు అందడం లేదు.

పటేల్, అశ్విన్ ల స్లోయర్ వేరియేషన్స్.. మిడిల్ ఓవర్లలో మ్యాజిక్ ను కనబరుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చెలరేగిపోతుండగా.. ఈ సారి టీం కంప్లీటెడ్ గా కనిపిస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ బ్యాటింగ్ లో అంతగా ప్రభావం చూపించకపోయినా లీడర్ షిప్ లో జట్టు బాగానే దూసుకుపోతుంది. గతేడాది ఉన్న రుతురాజ్ గైక్వాడ్ – డుప్లెసిస్ ఓపెనింగ్ కాంబినేషన్ కు కాస్త మార్పులు చేసి ఈ సారి కాస్త బయటపడ్డాడు. యూఏఈ వేదికగా జరిగిన నాలుగు లీగ్ మ్యాచ్ లలో మూడింటిలో (రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్) చేతిలో ఓడిపోయింది చెన్నై. ఈ మ్యాచ్ లలో నైనా ధోనీ స్టైల్ చూస్తామనే అభిమానుల ఆశలను ఏ పాటిలో నిలబెడతాడో చూడాలి.

……………………………………………..: అమెజాన్‌కు రూ.2కోట్ల 18లక్షలు టోకరా.. 20ఏళ్ల జైలు శిక్ష

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో రుతురాజ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. డుఫ్లెసిస్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపిస్తే.. రాయుడు, రైనా, బ్రావో చక్కబెట్టేస్తారు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో విఫలమైన రైనా ప్లేస్‌‌‌‌‌‌‌‌లో రాబిన్‌‌‌‌‌‌‌‌ ఊతప్పను తీసుకుంటాడా? అనేది ధోనీ ఎంపికను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా జట్టుకు మరోసారి కీలకంగా మారనున్నాడు. దానికి తోడు హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌, మొయిన్‌‌‌‌‌‌‌‌ అలీ, బ్రావో సీఎస్‌‌‌‌‌‌‌‌కే ఫైనల్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌కు మరింత బలంగా మారనుంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో శార్దూల్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ మెరిస్తే మ్యాచ్ గెలవడం ఖాయం.

ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఫైనల్‌‌‌‌‌‌‌‌ టిక్కెట్‌‌‌‌‌‌‌‌ టార్గెట్ పెట్టుకుంది. సీఎస్‌‌‌‌‌‌‌‌కేతో పోలిస్తే అనుభవం తక్కువైనప్పటికీ.. నాణ్యమైన ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు, స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌, బౌలర్లు అందుబాటులో ఉండటం అదనపు ప్రయోజనం కలిగించనుంది. స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై అంచనా లేకపోయినా.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉంటాడని పంత్‌‌‌‌‌‌‌‌ ఆశాభావంతో ఉన్నాడు. ఆవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (22 వికెట్లు), అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (15), రబాడ (13), నోర్జ్‌‌‌‌‌‌‌‌ (9) సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. అశ్విన్‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ చూపెడితే ఢిల్లీదే విజయం దక్కడంలో ఆశ్చర్యం లేదు.

×