IPL 2021 చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇది నాలుగోసారి..

ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చెన్నై 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ధోని సేన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది.

IPL 2021 చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇది నాలుగోసారి..

Ipl 2021 Champion Csk

IPL 2021 Finals : ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చెన్నై 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ధోని సేన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ముందు బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆ తర్వాత బౌలర్లు రాణించారు. దీంటో ఈ మ్యాచ్ లో సీఎస్కే ఘన విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది.

టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ దంచికొట్టాడు. సిక్సుల వర్షం కురిపించాడు. 59 బంతుల్లో 86 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు, రాబిన్ ఊతప్ప 31 పరుగులు, మోయిన్ ఆలీ 37 పరుగులతో రాణించారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు, శివమ్ మావి ఒక వికెట్ తీశారు.

‘అన్‌స్టాప‌బుల్‌’ షో కోసం బాలయ్య ఆహా అనిపించే పారితోషకం

193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా జట్టుకి ఓపెనర్లు గిల్, అయ్యర్ బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చారు. అయితే చెన్నై బౌలర్లు కమ్ బ్యాక్ చేశారు.కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో వికెట్లు తీశారు. ఆ తర్వాత రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు పడ్డాయి. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది.

Pizzas : పిజ్జాలు, చిప్స్ తింటున్నారా… అయితే మతిమరుపు వ్యాధి ఖాయం

కోల్ కతా జట్టులో ఓపెనర్లు గిల్(43 బంతుల్లో 51), వెంకటేశ్ అయ్యర్(32 బంతుల్లో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం అయ్యారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, హేజిల్ వుడ్ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు తీశారు. దీపక్ చహర్, బ్రావో చెరో వికెట్ తీశారు. ఐపీఎల్ లో ఏకంగా తొమ్మిదిసార్లు ఫైనల్‌ చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. టైటిల్‌ను గెలవడం ఇది నాలుగోసారి.