IPL 2021 Finals KKR Vs CSK దంచికొట్టిన డుప్లెసిస్.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ 2021 ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయ్. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున

IPL 2021 Finals KKR Vs CSK దంచికొట్టిన డుప్లెసిస్.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం

Kkr Vs Csk

IPL 2021 KKR Vs CSK : ఐపీఎల్ 2021 సీజన్-14 ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయ్. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

చెన్నై ఓపెనర్ ఫా డుప్లెసిస్ చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించాడు. 59 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు, రాబిన్ ఉతప్ప 31 పరుగులు, మోయిన్ ఆలీ 37 పరుగులతో రాణించారు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు, శివమ్ మావి ఒక వికెట్ తీశారు.

Moeen Ali

చెన్నై ఇన్నింగ్స్ ను ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ ప్రారంభించారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 8.1 ఓవర్లలో 61 పరుగులు జోడించారు. స్కోర్ బోర్డు వేగంగా కదులుతున్న సమయంలో గైక్వాడ్ 32 (27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. నరైన్ బౌలింగ్ లో శివమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Pizzas : పిజ్జాలు, చిప్స్ తింటున్నారా… అయితే మతిమరుపు వ్యాధి ఖాయం

ఏకంగా తొమ్మిదిసార్లు ఫైనల్‌ చేరిన ఫేవరెట్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగో టైటిల్‌పై కన్నేయగా… రెండు సార్లు ఫైనల్‌ చేరితే ఆ రెండుసార్లూ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ ఆనవాయితీని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మూడో ఐపీఎల్‌ టైటిల్‌తో దుబాయ్‌ నుంచి దిగ్విజయంగా తిరిగి రావాలని ఆశిస్తోంది.

Faf du Plessis

గతేడాది ప్లే ఆఫ్స్‌కే అర్హత సాధించని ఇరు జట్లను కెప్టెన్లు ధోని, మోర్గాన్‌ ఈ సీజన్‌లో సమర్థంగా నడిపించారు. ఇప్పుడు అసలు పోరులో వారి సారథ్యం, బ్యాటింగ్‌ సామర్థ్యం జట్టుకు గెలిపిస్తాయా అనేది ఆసక్తికరం. ధోని నాయకత్వంలోనే చెన్నై మూడు సార్లు చాంపియన్‌గా నిలవగా, ధోనిలాగే వరల్డ్‌ కప్ గెలిపించిన మోర్గాన్‌.. సారథిగా తొలి ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేశాడు.

Eyesight : మెరుగైన కంటి చూపుకోసం… తీసుకోవాల్సినవి ఏంటంటే!..

12 సీజన్లు ఐపీఎల్‌ ఆడితే ఏకంగా 9 సార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత ధోనిదే. ఈ సీజన్‌లో అక్కడా… ఇక్కడా… రెండు సార్లు కోల్‌కతాపై గెలిచిన సానుకాలంశం చెన్నైని మురిపిస్తోంది. ముంబై, అబుదాబీలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లలో సూపర్‌కింగ్స్‌ జట్టే గెలిచింది.