IPL 2021 KKR vs RCB : కోహ్లీ సేన ఘోర పరాజయం

ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు రెండో రోజు కోల్‌కతా నైట్ రైడర్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన ఘోర పరాజయం పాలైంది. 9 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన వి

IPL 2021 KKR vs RCB : కోహ్లీ సేన ఘోర పరాజయం

Ipl 2021 Kkr Vs Rcb

IPL 2021 KKR vs RCB : ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు రెండో రోజు కోల్‌కతా నైట్ రైడర్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన ఘోర పరాజయం పాలైంది. 9 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 93 పరుగుల టార్గెట్ ను వికెట్ నష్టపోయి 10 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ ఓపెనర్లే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. శుభ్ మన్ గిల్ 34 బంతుల్లో 48 పరుగులు, వెంకటేష్ ఐయ్యర్ 27 బంతుల్లో 41 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లి రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, జట్టుకు శుభారంభం లభించలేదు. ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఈ జట్టు కోల్‌కతాతో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైంది. 19 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్ కతా బౌలర్లు విజృంభించారు. బెంగళూరు బ్యాట్స్ మెన్ ను ఆటాడుకున్నారు.

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

ఆర్సీబీ లో దేవదత్ పడిక్కల్ (22), శ్రీకర్ భరత్ (16) కాసేపు నిలబడ్డారు. ఆ తర్వాత పడిక్కల్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక అప్పటి నుంచి బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (10), డివిలియర్స్ (0), సచిన్ బేబీ (7), వానిందు హసరంగ్ (0), కైల్ జేమీసన్ (4), హర్షల్ పటేల్ (12), మహమ్మద్ సిరాజ్ (8), యుజ్వేంద్ర చాహల్ (2 నాటౌట్) పరుగులు మాత్రమే చేశారు.

SBI Warning : ఆ నంబర్లతో జాగ్రత్త.. ఖాతాదారులకు SBI హెచ్చరిక

కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ ఒకటి, ఫెర్గూసన్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన వరుసగా వికెట్లు కోల్పోతూ పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. తొలి వికెట్‌గా కోహ్లీ(5) వెనుదిరిగాడు. ఆ తరువాత ఏ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేదు. కేకేఆర్ బౌలర్లకు వికెట్లను సమర్పించుకున్నారు.

భారత్‌లో జరిగిన తొలి దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లాడి రెండు విజయాలు సాధించిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్ ఆశలు నిలవాలంటే మాత్రం ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి. గణాంకాల పరంగా కేకేఆర్ ఆధిక్యంలో ఉంది. కేకేఆర్ 27 మ్యాచ్‌లలో 14 గెలిచింది. ఆర్‌సీబీ ఖాతాలో కేవలం 13 విజయాలు మాత్రమే ఉన్నాయి. చివరిసారిగా రెండు జట్లు ఏప్రిల్ 18 న తలపడ్డాయి. ఆర్‌సీబీ 38 పరుగుల తేడాతో గెలిచింది.