IPL 2021: పంజాబ్ కింగ్స్‌కు కేఎల్ రాహుల్ గుడ్ బై

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ తర్వాతి సీజన్ కు జట్టులో ఉండేందుకు అనాసక్తిగా కనిపిస్తున్నాడు. ఈ మేర జట్టుకు వీడ్కోలు పలికి వేలంలోకి రావాలని చూస్తున్నాడట.

IPL 2021: పంజాబ్ కింగ్స్‌కు కేఎల్ రాహుల్ గుడ్ బై

Kl Rahul

IPL 2021: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ తర్వాతి సీజన్ కు జట్టులో ఉండేందుకు అనాసక్తిగా కనిపిస్తున్నాడు. ఈ మేర జట్టుకు వీడ్కోలు పలికి వేలంలోకి రావాలని చూస్తున్నాడట. ప్రస్తుత సీజన్ లో 13గేమ్స్ ఆడి 626పరుగులు చేసి ఆర్ క్యాప్ రేసులో ఉన్న రాహుల్.. ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

ఇంగ్లీష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే సీజన్ కోసం రిటెన్షన్ జాబితాలో రాహుల్ ఉండటానికి ఇష్టపడటం లేదట. దీనిపై పంజాబ్ జట్టు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

‘ఆర్టీఎమ్ (రైట్ టూ మ్యాచ్) కార్డ్స్ వాడే హక్కు ఫ్రాంచైజీకి ఉంటుంది. వేలంలో దానిని వాడుకోవచ్చు. ప్రస్తుత ప్లేయర్లను ఉంచుకోవాలా వద్దా అని చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ ను జట్టులో కొనసాగించడానికే ప్రయత్నిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో ఒకడైన కేఎల్ రాహుల్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదని’ ఇంగ్లీష్ మీడియా చెప్పింది.

మరోవైపు కేఎల్ రాహుల్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్లనున్నాడని వార్తలు బయటకొస్తున్నాయి. IPL 2022లో జట్టుకు కెప్టెన్ గా కొనసాగనని విరాట్ కోహ్లీ ఆల్రెడీ చెప్పేశాడు. దీంతో ఆ జట్టు ఒక స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్ కోసం ఎదురుచూస్తుందని సమాచారం.