IPL 2021 CSK vs MI : రుతురాజ్ వీరవిహారం.. ముంబై టార్గెట్ 157

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశలో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలో తడబడినా చెన్నై నిలదొక్

IPL 2021 CSK vs MI : రుతురాజ్ వీరవిహారం.. ముంబై టార్గెట్ 157

Ipl 2021, Csk Vs Mi

IPL 2021 CSK vs MI : ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశలో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలో తడబడినా చెన్నై నిలదొక్కుంది. ముంబై ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ముంబై గెలవాలంటే 157 రన్స్ చేయాలి.

Mother Drink Urine : గుండెలు పిండే విషాదం.. తన మూత్రం తానే తాగిన తల్లి

చెన్నై జట్టు బ్యాట్స్ మెన్ తడబడ్డారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చెన్నై చిక్కుల్లో పడింది. ఈ సమయంలో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. వీరవిహారం చేశాడు. 58 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ రాణించడంతో చెన్నై జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. చివరలో జడేజా 26 పరుగులు, బ్రావో 23 పరుగులతో రాణించారు. బ్రావో మూడు సిక్సులు బాదాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్, ఆడమ్ మిల్నె, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు.

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ లేని కారణంగా ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. కీరన్ పొలార్డ్ కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు.

Online Auction : ఒక్క రూపాయి ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..ఒక్క నాణెం మిలియనీర్‌‌ను చేసింది

క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చింది. ఐపీఎల్-14 భారత్ లో సగంలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఐపీఎల్ ఆగిపోగా, మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో నిర్వహిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 16,2021) తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు దుబాయ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు కీరన్ పొలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు. ముంబై జట్టులో అన్మోల్ ప్రీత్ సింగ్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇరు జట్ల బలాబలాలు చూస్తే… ముంబయి జట్టులో రోహిత్ లేకపోయినా డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్ రూపంలో భారీ హిట్టర్లున్నారు. బౌలింగ్ లోనూ ఆ జట్టుకు అద్భుతమైన వనరులున్నాయి. ప్రపంచ ఉత్తమ పేసర్లుగా పరిగణించే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లతో ముంబయి బౌలింగ్ పటిష్టంగా ఉంది.