IPL 2021 MI Vs KKR : వార్ వన్ సైడ్.. ముంబైపై కోల్‌కతా అలవోక విజయం

వార్ వన్ సైడ్ అయ్యింది. ముంబై తేలిపోయింది. కోల్ కతా అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో..

IPL 2021 MI Vs KKR : వార్ వన్ సైడ్.. ముంబైపై కోల్‌కతా అలవోక విజయం

Mi Vs Kkr

IPL 2021 MI Vs KKR : ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై తేలిపోయింది. కోల్ కతా జట్టు సునాయాసంగా గెలిచింది. ముంబై నిర్దేశించిన 156 పరుగుల టార్గెట్ ను కోల్ కతా 7 వికెట్ల తేడాతో అలవోకగా చేజ్ చేసింది. యువ బ్యాట్స్ మెన్ వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయ్యర్ 30 బంతుల్లో 53 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. ఇక రాహుల్ త్రిపాఠి వీరవిహారం చేశాడు. 42 బంతుల్లో 74 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ముంబై బౌలర్లు తేలిపోయారు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.

Paytm బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్, కండీషన్స్ అప్లయ్

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులే చేసింది. తొలి వికెట్ కు రోహిత్ శర్మ (33), క్వింటన్ డికాక్ (55) జోడీ 9.2 ఓవర్లలో 78 పరుగులు జోడించి శుభారంభం అందించినా, కోల్ కతా బౌలర్లు సమయోచితంగా విజృంభించారు. ముంబయిని భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ

సూర్యకుమార్ యాదవ్ 5, ఇషాన్ కిషన్ 14, పొలార్డ్ 21, కృనాల్ పాండ్య 12 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో ఫెర్గుసన్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. సునీల్ నరైన్ కు ఓ వికెట్ లభించింది. ఇక, లక్ష్యఛేదనలో కోల్ కతా ఓపెనర్లు దూకుడు ప్రదర్శించారు. జట్టుని విజయతీరాలకు చేర్చారు. 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను కేకేఆర్ ఛేదించింది.

స్కోర్లు..
ముంబై..155/6
కోల్ కతా.. 159/3(15.1ఓవర్లు)