IPL 2021 MI Vs RR డూ ఆర్ డై మ్యాచ్‌లో ముంబై ఘన విజయం

ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ షో తో రాజస్తాన్ రాయల్స్ జట్టుని చిత్తు చేసింది. 8 వికెట్ల తేడాతో గ్ర

IPL 2021 MI Vs RR డూ ఆర్ డై మ్యాచ్‌లో ముంబై ఘన విజయం

Mumbai Indians Beat Rajasthan Royals

IPL 2021 MI Vs RR : ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో రాజస్తాన్ రాయల్స్ జట్టుని చిత్తుగా ఓడించి, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 8 వికెట్ల తేడాతో రోహిత్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత ముంబై బౌలర్లు నిప్పులు చెరిగారు. ఆ తర్వాత బ్యాట్స్ మెన్ సత్తా చాటారు.

Ticket Prices : వైజాగ్ టు హైదరాబాద్ రూ.3వేలు.. టికెట్ల ధరలు భారీగా పెంపు

Ishan Kishan

రాజస్తాన్ నిర్దేశించిన 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేన ఈజీగా చేధించింది. 8.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో(25 బంతుల్లో 50*) అదరగొట్టాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (22) అదిరే ఆరంభం ఇచ్చాడు. రోహిత్ ఔటయ్యాక ఇషాన్ సిక్సర్ల మోత మోగించడంతో 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది ముంబై.

గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తారు. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. అలాంటి మ్యాచ్ లో రాజస్తాన్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ముంబై బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 90 పరుగులే చేసింది. కనీసం 100 పరుగుల మార్క్ కూడా టచ్ చేయలేకపోయింది. ముంబై పేసర్లు నిప్పులు చెరిగారు. గత మ్యాచ్ లో వీర లెవెల్ లో చేజింగ్ చేసి, చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన రాజస్తాన్… ముంబయితో మ్యాచ్ లో చేతులెత్తేసింది.

Happy faces for Mumbai Indians

ఆ జట్టులో అత్యధికంగా ఎవిన్ లూయిస్ 24 పరుగులు చేశాడు. జైశ్వాల్ 12, కెప్టెన్ సంజు శాంసన్ 3, శివం దూబే 3, గ్లెన్ ఫిలిప్స్ 4, డేవిడ్ మిల్ల్ 15, రాహుల్ తెవాటియా 12 పరుగులు చేశారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జిమ్మీ నీషమ్ కూడా ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలను ముంబై సజీవంగా ఉంచుకుంది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ..!

Shivam Dube

 

 

స్కోర్లు…
రాజస్తాన్-90/9
ముంబై-94/2(8.2ఓవర్లు)