IPL 2021 Final: ఓడి గెలిచింది.. అసలు విజేత కోల్‌కతానే : ధోనీ ప్రశంస

ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీసేన విజయం సాధించింది.

IPL 2021 Final: ఓడి గెలిచింది.. అసలు విజేత కోల్‌కతానే : ధోనీ ప్రశంస

Ipl 2021 Ms Dhoni Heaps Praise On Kolkata Knight Riders

KKR Deserve to Win : ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీసేన 27 పరుగుల తేడాతో  గెలిచింది. ముంబై ఇండియన్స్ (5) తర్వాత అత్యధిక సార్లు టైటిల్ సాధించిన జట్టుగా చెన్నై రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ విజయం అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ మీడియాతో మాట్లాడుతూ కోల్ కతా ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ సీజన్ టైటిల్ విజేత తామే (CSK) అయినప్పటికీ.. వాస్తవానికి అసలైన విజేత కోల్‌కతా(KKR)నే అని అన్నాడు.
IPL2021 : చెన్నై విజయోత్సాహం.. వైరల్ వీడియో

రన్నరప్ గా నిలిచిన ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని కోల్ కతా జట్టును ధోనీ ఆకాశానికి ఎత్తేశాడు. కరోనా పుణ్యామని ఈ టోర్నీ రెండు భాగాలుగా జరగాల్సి వచ్చిందన్నాడు. అదే మోర్గాన్ టీమ్ బాగా కలిసొచ్చిందని తెలిపాడు. చెన్నై విజయం గురించే మాట్లాడే ముందు కోల్ కతా గురించి చెప్పాలన్నాడు. పేలవమైన జట్టుగా ఉన్న కోల్ కతా వేగంగా పుంజుకోవడం క్లిష్టమైన పనిగా చెప్పుకొచ్చాడు ధోనీ. ఈ సీజన్ లో కోల్ కతా ఆటగాళ్లు చాలా శ్రమించారు. ఈ సీజన్ విజేతగా నిలవడానికి అర్హులు ఎవరంటే.. అది కచ్చితంగా కోల్ కతానే అని ధోనీ స్పష్టంచేశాడు.


చెన్నై విషయానికి వస్తే.. మా జట్టులో పలువురి ఆటగాళ్లను మార్చాల్సి వచ్చింది. ప్రతి మ్యాచ్ తర్వాత మాకు సరైన మ్యాచ్ విన్నర్లు అవసరం పడింది. మంచి ఫామ్‌తో ఆకట్టుకున్నారు. ఎక్కువ సార్లు ఫైనల్ కు చేరడం అంత సులభం కాదు. జట్టు ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ ఫైనల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి అనుభవమే గతంలో ఫైనల్స్లోనూ మాకు ఎదురైంది. ఫలితంగా ఓటమిపాలయ్యాం. మా ఆటగాళ్లు ఆటతీరు బాగుంది. సరైన ప్లేయర్లు లేకపోతే ఇలా విజయాలు సాధించడం కష్టమని ధోనీ అభిప్రాయపడ్డాడు. చెన్నై అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని తెలిపాడు.
IPL 2021 చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇది నాలుగోసారి..