MS Dhoni: ‘ధోనీ లేకుండా సీఎస్కే లేదు.. సీఎస్కే లేకుండా ధోనీ..’ – శ్రీనివాసన్

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 టైటిల్ సాధించి చెన్నైను ప్రపంచంలోనే టాప్ గా నిలిపిందన్నారు

10TV Telugu News

MS Dhoni: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 టైటిల్ సాధించి చెన్నైను ప్రపంచంలోనే టాప్ గా నిలిపిందని అన్నారు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలో సీఎస్కే ఐపీఎల్ 2021 ఛాంపియన్స్ గా మారిందని అన్నారు. అంతేకాకుండా 2010, 2011, 2018లతో పాటు ఈ సీజన్ కూడా విన్నర్ గా నిలిచి నాలుగో టైటిల్ దక్కించుకుంది.

సూపర్ కింగ్స్ తో పాటు ధోనీని పొగిడిన శ్రీనివాసన్.. ఇదొక గుర్తుండిపోయే విజయం.. ప్రపంచంలోనే చెన్నైని టాప్ లో నిల్చోబెట్టింది. ధోనీ అంటేనే సీఎస్కే, చెన్నై, తమిళనాడుల ఆస్తి. ధోనీ లేకుండా సీఎస్కే లేదు, సీఎస్కే లేకుండా ధోనీ ఉండడు. అని చెప్పుకొచ్చారు. గెలిచిన ట్రోఫీతో వెంకటచలపతి గుడికి వెళ్లొచ్చి అలా మాట్లాడారు.

2008 నుంచి 2014వరకూ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్న సీఎస్కే ఫ్రాంచైజీ.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ కు ట్రాన్సఫర్ అయింది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టిన చెన్నై.. నాలుగో ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ధోనీని ఒక్కడినే అట్టిపెట్టుకుని మిగతా వాళ్లను వేలంలోకి వదిలిపెట్టేసింది.

…………………………………………………: చెలరేగిన రాహుల్, ఇషాన్.. ఏడు వికెట్లతో ఇంగ్లాండ్‌పై విజయం

సీఎస్కే విజయోత్సవాల గురించి అడగ్గా.. టీ20 వరల్డ్ కప్ 2021కు మెంటార్ గా ఉన్న ధోనీ.. గ్యాప్ తీసుకుని చెన్నై వస్తారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు.

×