ఏజ్ ఒక నెంబర్ మాత్రమే.. ట్రైనింగ్ సెషన్లో ధోనీ ఫీట్లు చూశారా

ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రేజ్ చెక్కు చెదరడం లేదు. అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉంటున్న ధోనీ.. ఐపీఎల్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 9 నుంచి రాబోయే

ఏజ్ ఒక నెంబర్ మాత్రమే.. ట్రైనింగ్ సెషన్లో ధోనీ ఫీట్లు చూశారా

Digital Transaction (1)

IPL 2021 MS Dhoni: ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రేజ్ చెక్కు చెదరడం లేదు. అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉంటున్న ధోనీ.. ఐపీఎల్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 9 నుంచి రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ కు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్న ధోనీ సిక్సులతో అదరగొట్టాడు.

ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. నెట్స్ ప్రాక్టీస్ చేస్తూ.. బిగ్ సిక్సెస్ బాదేస్తున్నాడంటూ కామెంట్ పెట్టింది. 2020 సీజన్ లో సీఎస్కే ప్లే ఆఫ్ కూడా చేరుకోకుండా ఫెయిల్ అయింది. లీగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మాత్రమే పర్‌ఫార్మెన్స్ చేయడం ఇదే తొలిసారి.

ఆరు గేమ్స్ లు గెలిచి పాయింట్ల టేబుల్ లో ఏడోస్థానం నుంచే నిష్క్రమించింది. కొద్ది రోజుల ముందే చెన్నైకు చేరిన దోనీ.. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్ కు రెడీ అయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో బీస్ట్ మోడ్ ఆన్ చేసిన ధోనీ ఎమ్ఏ చిదంబరం స్టేడియం వేదికగా చెలరేగిపోయాడు.