IPL 2021: ఫిట్ అండ్ స్లిమ్ లుక్‌లో ధోనీ.. ఇంత ఛేంజా

మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్ 2021 రెండో దశకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకంగా రెడీ అయ్యారు. 40ల్లోకి అడుగుపెడుతున్నా..

IPL 2021: ఫిట్ అండ్ స్లిమ్ లుక్‌లో ధోనీ.. ఇంత ఛేంజా

Ms Dhoni (1)

IPL 2021: మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్ 2021 రెండో దశకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకంగా రెడీ అయ్యారు. 40ల్లోకి అడుగుపెడుతున్నా.. వయస్సుతో సంబంధం లేకుండా పూర్తి ఫిట్ నెస్ తో కనిపిస్తున్నారు. ఇదే ఐపీఎల్ మొదటి దశలో కనిపించిన దాని కంటే స్లిమ్ గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

రీసెంట్ గా ఇండియన్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ రాహుల్ వైద్య పెళ్లికి అటెండ్ అయిన ఎంఎస్ ధోనీ తిరిగి ముంబైకు చేరుకున్నారు. బ్లాక్ టీ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ లో కనిపించిన సీఎస్కే కెప్టెన్.. చాలా స్లిమ్ గా ఉన్నారు. ఫిట్‌నెస్‌కు ఎప్పుడూ ప్రియారిటీ ఇచ్చే ధోనీ.. సీజన్ ఆరంభంలో బ్యాటింగ్ తో అంతగా రాణించలేకపోయారు. గత టోర్నమెంట్ లోనూ ఇదే పరిస్థితి.

ప్రస్తుతం వెయిట్ లాస్.. బెస్ట్ షేప్ తో కనిపిస్తున్న ధోనీ.. రాబోయే సీజన్ లో ఇరగదీస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు ఖాయం అంటున్నారు. మరి సీజన్ ఆరంభమైతే కానీ తెలియదు.. పర్‌ఫార్మెన్స్ ఏ మేరకు ఉంటుందో..

ఐపీఎల్ 2021 టీమ్స్ పాయింట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ – ఆడిన మ్యాచ్‌లు 8 – వచ్చిన పాయింట్లు 12
చెన్నై సూపర్ కింగ్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 10
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 10
ముంబై ఇండియన్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 8
రాజస్థాన్ రాయల్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 6
పంజాబ్ కింగ్స్ – ఆడిన మ్యాచ్‌లు 8 – వచ్చిన పాయింట్లు 6
కోల్‌కతా నైట్ రైడర్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 4
సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 2