IPL 2021 PBKS Vs MI.. ముంబై టార్గెట్ 136

టాస్ గెల్చిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో మక్రమ్ 29 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు.

10TV Telugu News

IPL 2021 PBKS Vs MI : ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెల్చిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో మక్రమ్ 29 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. దీపక్ హుడా(28), కేఎల్ రాహుల్(21) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో పొలార్డ్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీశారు.

కాగా, సెకండ్‌ ఫేజ్‌లో ముంబయి ఇండియన్స్‌ అభిమానులకు ఇప్పటి వరకైతే నిరాశే మిగిల్చింది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడింది. పంజాబ్‌తో మ్యాచ్‌లోనైనా ముంబయి గెలుస్తుందా? లేదా? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతున్నా.. ప్లేఆఫ్స్‌ చేరాలంటే ముంబయి మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌తో సహా మిగిలిన మూడు మ్యాచుల్లో ఏ ఒక్కటి ఓడినా ముంబయి ప్లేఆఫ్‌కు వెళ్లడం కష్టమే.