IPL 2021 RCB Vs MI హర్షల్ హ్యాట్రిక్.. ముంబైపై బెంగళూరు గెలుపు

ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణించి ముంబైని

IPL 2021 RCB Vs MI హర్షల్ హ్యాట్రిక్.. ముంబైపై బెంగళూరు గెలుపు

Ipl 2021 Rcb Vs Mi

IPL 2021 RCB Vs MI : ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణించి ముంబైని చిత్తు చేసింది.

Rakul Preet Singh: షాకింగ్.. రకుల్ పెదవులకు సర్జరీ?

బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అదరగొట్టాడు. హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 18.1 ఓవర్లలోనే 111 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టులో రోహిత్ శర్మ-43, డికాక్-23 తప్ప ఎవరూ రాణించలేదు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4, చాహల్ 3, మ్యాక్స్ వెల్ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

17వ ఓవర్ లో హర్షల్ హ్యాట్రిక్ వికెట్ల ఘనత సాధించాడు. ఓవర్ లో తొలి బంతికి హార్దిక్ పాండ్యాను ఔట్ చేశారు. ఆ తర్వాత కీరన్ పొలార్డ్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ చాహర్ ను పెవిలియన్ పంపాడు. వరుస బంతుల్లో వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్ లో ఇదే తొలి హ్యాట్రిక్. 17 పరుగులు మాత్రమే ఇచ్చిన పటేల్..4 వికెట్లు తీసి ముంబై జట్టు వెన్ను విరిచాడు. కాగా, ఐపీఎల్ లో బెంగళూరు తరఫున హ్యాట్రిక్ తీసిన బౌలర్లలో హర్షల్ మూడోవాడు. ఇదివరకే బెంగళూరు జట్టుకి చెందిన ప్రవీణ్ కుమార్, శామ్యూల్ బద్రీ ఈ ఘనత సాధించారు. ఇక మరో విశేషం ఏంటంటే.. ఐపీఎల్ లో ముంబైని బెంగళూరు ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి.