IPL 2021: ఇండియన్‌గా అరుదైన ఫీట్ సాధించిన రోహిత్ శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో భాగంగా జరిగిన 51వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు

IPL 2021: ఇండియన్‌గా అరుదైన ఫీట్ సాధించిన రోహిత్ శర్మ

Rohiot Sharma

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో భాగంగా జరిగిన 51వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు. శ్రేయాస్ గోపాల్ తొలి ఓవర్లోనే ఈ ఫీట్ సాధించి షార్ట్ ఫామ్ లో 400సిక్సులు బాదిన ఏడో బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. ఇండియన్ ప్లేయర్ గా మాత్రం ఈ జాబితాలో రోహిత్ తొలి క్రికెటర్.

టీమిండియా కోసం రోహిత్ 133 సిక్సులు బాదితే, ఐపీఎల్ 227 సిక్సులు, మిగిలిన 24 ఛాంపియన్స్ లీగ్ టీ20లో కొట్టేశాడు. అతని 14ఏళ్ల కెరీర్ లో ఈ ఘనత సాధించడం విశేషం. అంతకంటే ముందు 400సిక్సులు బాదిన ప్లేయర్ల లిస్టులో క్రిస్ గేల్స్ (1042), కీరన్ పొలార్డ్ (758), ఆండ్రీ రస్సెల్ (510), బ్రెండన్ మెక్ కల్లమ్(485), షేన్ వాట్సన్ (467), డివిలియర్స్ (434)లు ఉన్నారు.

రాజస్తాన్ నిర్దేశించిన 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేన ఈజీగా చేధించింది. 8.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో(25 బంతుల్లో 50*) అదరగొట్టాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (22) అదిరే ఆరంభం ఇచ్చాడు. రోహిత్ ఔటయ్యాక ఇషాన్ సిక్సర్ల మోత మోగించడంతో 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది ముంబై.

…………………………………………..: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌కు హాకీ టీమిండియా నో!!

గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తారు. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. అలాంటి మ్యాచ్ లో రాజస్తాన్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ముంబై బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు.