IPL 2021 : కరోనా కలకలం…నటరాజన్‌కు పాజిటివ్

ఐపీఎల్ (IPL 2021)...లో మళ్లీ కరోనా కలకలం రేపింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో నటరాజన్ కరోనా బారిన పడ్డారు.

IPL 2021 : కరోనా కలకలం…నటరాజన్‌కు పాజిటివ్

Ipl 2021

SRH Pacer T Natarajan : ఐపీఎల్ (IPL 2021)…లో మళ్లీ కరోనా కలకలం రేపింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో నటరాజన్ కరోనా బారిన పడ్డారు. రెండు జట్లలలో అందరూ ఆటగాళ్లకు మరోసారి ఆర్టీపీసీఆర్ (RTPCR) టెస్టులు నిర్వహించారు. వీరికి సంబంధించిన రిపోర్టులు వచ్చాకే…మ్యాచ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 2021, సెప్టెంబర్ 22వ తేదీ బుధవారం సాయంత్రం జరగాల్సిన మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. కరోనా కారణంగా గతంలో ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Read More : IPL 2021 RR Vs PBKS : వాట్ ఏ మ్యాచ్.. ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ పై రాజస్తాన్ ఘన విజయం

IPL 2021 ఈ ఏడాది ఏప్రిల్‌లోనే భారత్‌లో ప్రారంభమైంది, కానీ కొంతమంది ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకిన తర్వాత సిరీస్ వాయిదా పడింది. దీంతో లీగ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమైంది. నియమ నిబంధనల మధ్య ఆటగాళ్లు అక్కడకు చేరుకున్నారు. బుధవారం ఢిల్లీ – హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఒక్కసారిగా నటరాజన్ కరోనా బారిన పడ్డారనే వార్త తీవ్ర కలకలం రేపింది. ఇతనితో సన్నిహితంగా ఉన్న వారందరూ హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. విజయ్ శంకర్, విజయ్ కుమార్ (టీమ్ మేనేజర్), శ్యామ్ సుందర్ (ఫిజియో థెరపిస్టు), అంజన వన్నన్ (డాక్టర్), తుషార్ (లాజిస్టిక్ మేనేజర్), గణేషన్ (నెట్ బౌలర్) లు ఐసోలేషన్ వెళ్లిన వారిలో ఉన్నారు. మోకాలి గాయంతో శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చాడు నటరాజన్.