IPL 2021 SRH Vs RCB బెంగళూరు టార్గెట్ 142

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్ట

IPL 2021 SRH Vs RCB బెంగళూరు టార్గెట్ 142

Royal Challengers Bangalore

IPL 2021 SRH Vs RCB : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.

హైదరాబాద్ జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్ (38 బంతుల్లో 44 పరుగులు) ఒక్కడే రాణించాడు. కెప్టెన్ కేన్ విలియమ్ సన్ (29 బంతుల్లో 31 పరుగులు) పర్లేదనిపించాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, క్రిస్టియన్ 2 వికెట్లు, యజువేంద్ర చాహల్ ఒక వికెట్, గార్టన్ ఒక వికెట్ తీశారు.

Harshal Patel

బెంగళూరు ఏమో వరుస విజయాలతో దూసుకుపోతోంది. హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. 12 మ్యాచులు ఆడి 8 విజయాలతో బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ ఖరారు చేసుకోగా.. అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తూ ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గిన సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి చాలా రోజుల క్రితమే నిష్క్రమించింది.

Tomato Cultivation : టమాటా సాగుతో భారీ లాభాలు…ఆరు నెలల్లో 30లక్షల ఆదాయం

ఈ సీజన్‌ తొలి దశ నుంచే ఆర్సీబీ మెరుగ్గా ఆడుతోంది. తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. మొదట నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమిపాలైంది. రెండో దశలో కోల్‌కతా, చెన్నై చేతిలో కంగుతిన్న ఆర్‌సీబీ.. తర్వాత పుంజుకుంది. బలమైన ముంబయి ఇండియన్స్‌ జట్టును 54 పరుగులతో ఓడించింది. అనంతరం రాజస్థాన్, పంజాబ్‌ కింగ్స్‌పై కూడా నెగ్గి హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసి ప్లే ఆఫ్స్‌ని ఖరారు చేసుకుంది. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలవాలని భావిస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, దేవదత్‌ పడిక్కల్‌ నిలకడగా పరుగులు చేస్తున్నారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

Jason Roy

SBI Gold డిపాజిట్ స్కీమ్ ఏంటి? ఎన్ని రకాలు, అర్హతలేంటి?

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ నుంచి ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్‌ రాలేదు. ఇదొక్కటే ఆందోళన కలిగించే విషయం. బౌలింగ్‌లో హర్షపటేల్ అదరగొడుతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు (26) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌ గాడిలో పడ్డట్టు కనిపిస్తున్నాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. మహ్మద్‌ సిరాజ్‌ అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బౌలింగ్‌లో ఈ జట్టు ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్లే ఆఫ్స్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

George Garton

సన్‌రైజర్స్‌..ఇకనైనా గెలుపు బాట పట్టేనా?
ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్సే. తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌..పంజాబ్‌ కింగ్స్‌ జట్టుపై మాత్రమే విజయం సాధించింది. సెకండాఫ్ లో పుంజుకుంటుందని భావించినా.. పరిస్థితిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. ఈ దశలో నాలుగు మ్యాచులు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.

Kane Williamson

సన్‌రైజర్స్‌ ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమవడం. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా నిలకడగా పరుగులు చేయడం లేదు. విలియమ్సన్‌, సాహా, అబ్దుల్ సమద్‌, మనీశ్ పాండే, కేదార్‌ జాదవ్‌ ఇలా ఏ ఆటగాడిని తీసుకున్నా నిలకడగా పరుగులు చేయడం లేదు. బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్ అహ్మద్‌, సిద్దార్థ్ కౌల్‌ ప్రభావం చూపలేకపోతున్నారు. మిగిలిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనైనా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో లోపాలను సరిచేసుకుని టోర్నీని విజయాలతో ముగిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.