IPL 2021 SRH Vs RR రఫ్ఫాడించిన రాయ్, హైదరాబాద్‌కు తొలి విజయం

ఐపీఎల్ 2021 సీజన్ 2 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన టార్గెన్ ను చేజ్ చేసింది. మరో

IPL 2021 SRH Vs RR రఫ్ఫాడించిన రాయ్, హైదరాబాద్‌కు తొలి విజయం

Ipl 2021 Srh Vs Rr

IPL 2021 SRH Vs RR : ఐపీఎల్ 2021 సీజన్ 2 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన టార్గెట్ ను చేజ్ చేసింది. మరో 9 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. హైదరాబాద్ ఓపెనర్ జేసన్ రాయ్ అద్భుతంగా ఆడగా, కెప్టెన్ కేన్ రాణించాడు.

హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి 167 పరుగులు చేసింది. రాజస్తాన్ జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో 60 పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టు గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. కేన్ 41 బంతుల్లో 51 పరుగులు(నాటౌట్) చేశాడు. అభిషేక్ శర్మ 21 పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో రెహ్మాన్, సకారియా, లామ్రర్ చెరో వికెట్ తీశారు. కాగా, సీజన్ 2లో హైదరాబాద్ కు ఇదే తొలి విజయం. ఐపీఎల్-14లో 10 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు విజయాలే నమోదు చేసింది.

Google Chrome వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. వెంటనే ఈ పని చేయండి

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చెలరేగాడు. 57 బంతుల్లో 82 పరుగులు చేశాడు. యశస్వి జైశ్వాల్ 36 పరుగులు, మహిపాల్ 29 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు, సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు…ఎలా ఉపయోగించాలో తెలుసా?

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన రాజస్తాన్ ఆ తర్వాత దూకుడుగా ఆడింది. కానీ, చివర్లో తడబడింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (82) అద్భుత అర్ధశతకం సాధించడంతో రాజస్తాన్ ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌ (6) విఫలం కాగా.. అనంతరం వచ్చిన సంజూ శాంసన్‌ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ (38)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే జైశ్వాల్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్‌ (4) ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన రాజస్థాన్‌ను మహిపాల్‌ లామరర్‌ (29)తో కలిసి శాంసన్‌ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో సంజూతోపాటు పరాగ్‌ పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్‌ 164 పరుగులకే పరిమితమైంది.