IPL 2022: వేలం తర్వాత పంజాబ్ జట్టు పూర్తి వివరాలివే
బెంగళూరు వేదికగా పంజాబ్ జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది. మయాంక్, ధావన్ పెద్ద మొత్తంలో తీసుకుంటున్న ప్లేయర్లు కాగా కెప్టెన్ పేరు అధికారికంగా కన్ఫామ్ కాలేదు.

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పంజాబ్ జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది. మయాంక్, ధావన్ పెద్ద మొత్తంలో తీసుకుంటున్న ప్లేయర్లు కాగా కెప్టెన్ పేరు అధికారికంగా కన్ఫామ్ కాలేదు.
15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు. కాకపోతే 204ప్లేయర్లు (67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు. వేలంలో ఇషాన్ కిషన్ రూ.15.25కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ రూ.14కోట్లుకు కెప్టెన్ ఎంఎస్ ధోనీ కంటే ఎక్కువ ధర పలికాడు. విదేశీ ప్లేయర్లలో లియామ్ లివింగ్ స్టోన్ కోసం రూ.11.50కోట్ల వరకూ వెచ్చించి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
Punjab Kings
శిఖర్ ధావన్ (రూ. 8.25 కోట్లు), కగిసో రబాడ (రూ. 9.25 కోట్లు), జానీ బెయిర్‌స్టో (రూ. 6.75 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. 5.25 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్ (3.8 కోట్లు), షారుక్ ఖాన్ (రూ. 9 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ. 60 లక్షలు), జితేష్ శర్మ (రూ. 20 లక్షలు), ఇషాన్ పోరెల్ (రూ. 3.8 కోట్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 11.50 కోట్లు), ఒడియన్ స్మిత్ (రూ. 6 కోట్లు), సందీప్ శర్మ (రూ. 50 లక్షలు), రాజ్ అంగద్ బావా (రూ. 2) కోటి), రిషి ధావన్ (రూ. 55 లక్షలు), వైభవ్ అరోరా (రూ. 2 కోట్లు), నాథన్ ఎల్లిస్ (రూ. 75 లక్షలు), అథర్వ తైడ్ (రూ. 20 లక్షలు), బెన్నీ హోవెల్ (రూ. 40 లక్షలు).
అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
మయాంక్ అగర్వాల్ (రూ. 12 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (రూ. 4 కోట్లు).
మొత్తం జట్టు: 25; విదేశీ ప్లేయర్లు 7మంది.
Read Also : PSLV-C 52 ప్రయోగం విజయవంతం