IPL 2022: ఐపీఎల్ వేలంలో ప్లేయర్‌గా బెంగాల్ క్రీడా మంత్రి

ఐపీఎల్ 2022 మెగా వేలానికి సంబంధించి ఫైనల్ చేసిన జాబితాలో 590మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో మనోజ్ తివారీ ఒకరు.

IPL 2022: ఐపీఎల్ వేలంలో ప్లేయర్‌గా బెంగాల్ క్రీడా మంత్రి

Ipl 2022

IPL 2022: వెటరన్ ఇండియన్ క్రికెటర్, బెంగాల్ ప్రస్తుత క్రీడా యువజన వ్యవహారాల శాఖ మంత్రి మనోజ్ తివారీ కూడా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్నారు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి సంబంధించి ఫైనల్ చేసిన జాబితాలో 590మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో మనోజ్ తివారీ ఒకరు. ఐపీఎల్ 2021 సీజన్ కు గానూ ఈ ప్లేయర్ ఏ జట్టులోకి తీసుకోకుండానే ఉండిపోయాడు.

2018లో పంజాబ్ జట్టు మనోజ్ తివారీని కొనుగోలు చేసింది. 98గేమ్స్ ఆడిన తివారీ 1695 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. కనీస ధర రూ.50లక్షలకే వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ రైట్ హ్యాండ్స్ బ్యాట్స్ మన్.. రంజీ ట్రోఫీ సీజన్ 2022లో బెంగాల్ కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యాడు కూడా.

రిచెస్ట్ క్రికెట్ లీగ్‌గా పిలిచే ఐపీఎల్ మెగా వేలం త్వరలో జరగబోతుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలం ఉండబోతుంది. ఇప్పటికే పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయగా.. కొత్తగా వచ్చిన రెండు జట్లు వేలం కంటే ముందు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఎట్టకేలకు మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్‌ని బీసీసీఐ అఫిషియల్‌గా రిలీజ్ చేసింది.

Read Also : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

2022లో ఐపీఎల్ కోసం నిర్వహించే వేలంలో మొత్తం 590మంది ప్లేయర్లు ఉండబోతున్నారు. అందులో 228మంది జాతీయ జట్టు ఎంపికైన క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. 355మంది జాతీయ జట్టుకు ఇఫ్పటివరకు ఎంపికకాని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు. ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.