IPL 2022 : ఐపీఎల్‌-2022లో ఇక ఆ ప్రకటనలు ఉండవట.. ఎందుకో తెలుసా?

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి మరో రెండు రోజులే సమయం ఉంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం ఐపీఎల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

IPL 2022  : ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి మరో రెండు రోజులే సమయం ఉంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం ఐపీఎల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి ఫైనల్ వరకు పలు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కంపనీలు ఫుల్ బిజీగా ఉంటాయి. ఐపీఎల్ మ్యాచ్ జరిగే సీజన్ మొత్తం తమ ప్రకటనలతో హోరెత్తిస్తుంటాయి. కానీ, సీన్ మారింది.. కరోనా తర్వాత ఐపీఎల్ 2022లో ఆయా కంపెనీల ప్రకటనలు కనిపించవు. ఎందుకంటే.. ఐపీఎల్‌-2022లో భారత్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ కంపెనీలు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాయి.

IPL 2022 ప్రకటనదారులు క్రిప్టోకరెన్సీ కంపెనీలు IPL 2022 భారత్‌లోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ కంపెనీలు ఈ ఏడాది జరగబోయే IPL 2022లో ప్రకటనలు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. IPL 2021లో, క్రిప్టో కరెన్సీ కంపెనీలు సీజన్ 15లో CoinDCX, WazirX, CoinSwitch Kuber వంటి క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలు, ఇతరులు ప్రకటనలకు దూరంగా ఉండనున్నాయి.

అందిన నివేదిక ప్రకారం.. IPL ప్రకటనలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని బ్లాక్‌చెయిన్, క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (BACC) నిర్ణయం తీసుకుంది. అన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీలు IPLలో ప్రకటనలు చేయకూడదని నిర్ణయించుకున్నాయని క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirX చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిశ్చల్ శెట్టి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Ipl 2022 Big Decision By Crypto Currency Companies, ‘will Not Advertise Around Ipl 2022

గత ఏడాదిలో CoinDCX, WazirX, CoinSwitch Kuber, ఇతరులు యాడ్ కంపెనీలు IPL కోసం టీవీ ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కేవలం తమ ప్రకటనల కోసమే దాదాపు రూ.90 కోట్లను వెచ్చించినట్టు తెలిసింది. డిస్నీ హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రకటనల కోసం మరో 15-20 కోట్లు ఖర్చు చేశాయట. భారత్‌లో క్రిప్టోకరెన్సీ భారీ ఆదరణను పొందింది. ఐపీఎల్ టోర్నీలో ప్రకటనల కోసం పలు కంపెనీలు క్రిప్టో ఎక్సేఛేంజ్‌లను నెలకొల్పాయి. ఐపీఎల్‌-15 ఎడిషన్‌ అడ్వర్టైజింగ్‌ స్పాట్స్‌ను బుక్‌ చేసుకునేందుకు సిద్దంగా లేన్నట్లు తెలుస్తోంది. ఆయా కంపెనీలు తమ ప్రకటనల కోసం డబ్బులను వెచ్చించేందుకు రెడీగా లేవని సమాచారం.

గత ఏడాది 2021లో ఐపీఎల్‌ పది సెకన్ల యాడ్‌కు సుమారు రూ. 13 నుంచి 18 లక్షల వరకు ఛార్జ్‌ చేసినట్లు తెలిసింది. దేశంలో క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఆయా కంపెనీలు వెనకడుగు వేసినట్లు తెలిసింది. 2022-23 బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని క్రిప్టో కరెన్సీలు, ఇతర డిజిటల్‌ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్నులను రూ. 10 వేల కన్నా ఎక్కువ వర్చువల్‌ కరెన్సీల పేమెంట్స్ చేస్తే 1 శాతం వరకు టీడీఎస్‌ విధిస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో క్రిప్టో ఇన్వెస్టర్లకు, ఎక్సేఛేంజ్‌లకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. అందుకే క్రిప్టో కరెన్సీ కంపెనీలు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో యాడ్స్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని సమాచారం.

Read Also : IPL 2022: తొలి సారి 1000 కోట్ల మార్కు చేరుకోనున్న ఐపీఎల్ రెవెన్యూ

ట్రెండింగ్ వార్తలు