IPL 2022: వేలంలో అమ్ముడుపోకుండా సురేశ్ రైనా

బెంగళూరు వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు ముందు ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13 రెండ్రోజులు జరిగిన వేలంలో షాకింగ్ అమ్మకాలను చూశాం. ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికీ...

IPL 2022: వేలంలో అమ్ముడుపోకుండా సురేశ్ రైనా

Ipl

IPL 2022: బెంగళూరు వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు ముందు ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13 రెండ్రోజులు జరిగిన వేలంలో షాకింగ్ అమ్మకాలను చూశాం. ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికీ, వరల్డ్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్ అయినప్పటికీ ఐపీఎల్ లో నిరాశ తప్పని ప్లేయర్లు కూడా ఉన్నారు. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన స్టార్ ప్లేయర్లు వీరే.

1. సురేశ్ రైనా
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్లలో రైనా ఒకరు. లీగ్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన వారిలో 5వేల 528పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో 5వేలకు మించి స్కోరు చేసిన ఆరుగురిలో రైనా ఒకడు. అయినా చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి వదిలేసిన తర్వాత కొనుగోలుచేసేవారే లేకుండా పోయారు. ఐపీఎల్ 2020 సీజన్ వ్యక్తిగత కారణాలతో దూరమైన రైనా.. 2021లో కనిపించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికేశాడు రైనా.

2. అమిత్ మిశ్రా
ఇండియా లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ లో లసిత్ మలింగా తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ అమిత్ మిశ్రా. సత్తా చాటుతున్నప్పటికీ 30దాటిన వయస్సు, గాయాల నుంచి రికవరీ కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం అతని కొనుగోలుపై ప్రభావం చూపాయి. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వేలానికి వదిలేసిన తర్వాత సింగిల్ గా ఉండిపోయాడు.

3. ముజీబ్ జద్రాన్
ప్రారంభ ధర రూ.2కోట్లతో వచ్చిన అఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ జద్రాన్ ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి కనబరచలేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (2021)లోనూ చక్కని ఆటతీరు కనబరిచిన ముజీబ్.. అంతర్జాతీయంగా ఇతర ఫార్మాట్లలోనూ బౌలింగ్ మ్యాజిక్ ప్రదర్శించాడు. అలాంటిది పంజాబ్ కింగ్స్ వేలానికి వదిలిపెట్టేశాక ఐపీఎల్ 2022కు ఊరకుండిపోయాడు.

4. కేన్ రిచర్డ్‌సన్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ టీ స్పెషలిస్ట్ అయిన కేన్ కొనుగోలు పట్ల ఐపీఎల్ 2022లో ఆసక్తి కనబరచలేదు. వ్యక్తిగత కారణాలతో ఇటీవలే కొన్ని సిరీస్ ల నుంచి తప్పుకున్నాడు రిచర్డ్‌సన్.