IPL 2022: ఐపీఎల్ వేలంలో ఆ నాలుగు షాకింగ్ కొనుగోళ్లివే

ఊహించినట్లుగా డిమాండబుల్ ప్లేయర్లకు ధర దక్కడాన్ని విశేషంగా ఫీల్ అవలేం. ఆశ్చర్యపరిచే విధంగా నలుగురు ప్లేయర్లు మాత్రం అంచనాలకు మించి ధర పలికారు.

IPL 2022: ఐపీఎల్ వేలంలో ఆ నాలుగు షాకింగ్ కొనుగోళ్లివే

Ipl

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆ నాలుగు కొనుగోళ్లు షాకింగ్ గా నిలిచాయి. ముందుగా ఊహించినట్లుగా డిమాండబుల్ ప్లేయర్లకు ధర దక్కడాన్ని విశేషంగా ఫీల్ అవలేం. ఆశ్చర్యపరిచే విధంగా నలుగురు ప్లేయర్లు మాత్రం అంచనాలకు మించి ధర పలికారు.

జోఫ్రా ఆర్చర్ – రూ.8 కోట్లు
ఇంగ్లాండ్ పేసర్ అయిన జోఫ్రా ఆర్చర్ ను ముంబై ఇండియన్స్ రూ.8కోట్లకు కొనుగోలు చేసింది. నిజానికి ఆర్చర్ ఐపీఎల్ 2022 సీజన్ కు అందుబాటులో ఉండడు. గాయం కారణంగా దూరమైన అతణ్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జూన్ వరకూ మైదానంలోకి రాకుండా రెస్ట్ తీసుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ ఐపీఎల్ 2023 సీజన్ లో ఆడించేందుకు ముందుగానే కొనుగోలు చేసింది ముంబై.

రొమారియో షెఫార్డ్ – రూ. 7.75కోట్లు
వెస్టిండీస్ ఆల్ రౌండర్ అయిన రొమారియో కనీస ధర రూ.70లక్షల నుంచి వేలం మొదలైంది. దాదాపు వంద రెట్లు అధికంగా పలికి ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి దక్కాడు.

Read Also: మళ్లీ ముంబైకే టెండూల్కర్.. కాకపోతే,

కే గౌతం – రూ.90లక్షలు
గౌతంను లక్నో సూపర్ జెయింట్స్ రూ.90లక్షలకే కొనుగోలు చేసింది. ఇందులో ఆశ్చర్యపడేదేం లేదు. వేలంలో కొనుగోలు సాధారణమే అనుకోవద్దు. గత సీజన్లో వేలానికి వదిలిపెట్టకముందు వరకూ రాజస్థాన్ రాయల్స్ రూ.9కోట్ల కాంట్రాక్ట్ తో జట్టులో ఉంచుకుంది.

లియామ్ లివింగ్ స్టోన్ – రూ.11.50కోట్లు
ప్రారంభ ధర రూ.1.5కోట్ల నుంచి మొదలైన లియామ్ లివింగ్ స్టోన్ ను పంజాబ్ కింగ్స్ పది రెట్లు వెచ్చించి రూ.11.50కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన లియామ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.