IPL 2022: టాస్ వేసేటప్పుడు రవిశాస్త్రి చెవిలో పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IPL 2022: టాస్ వేసేటప్పుడు రవిశాస్త్రి చెవిలో పాండ్యా

Hardik Pandya

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడుతుండగా, అరంగేట్రం చేసిన గుజరాత్‌ టైటాన్స్ తమ తొలి సీజన్‌లో టైటిల్‌ పోరుకు చేరుకుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ వేసే సమయంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత పాండ్యా అతణ్ని కలిసినట్లు అయింది.

టాస్ వేసిన తర్వాత పాండ్యా మాట్లాడుతూ.. మేం ముందు బౌలింగ్ వేద్దాం అనుకున్నా. మా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంత మంది రావడం చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్ నిర్ణయాలు తీసుకుని గేమ్ ను సాధారణంగా ముగించాలనుకుంటున్నాం. మా బాయ్స్ రెడీగా ఉన్నారు. సపోర్ట్ స్టాఫ్ కి ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది” అని అన్నాడు.

ఆ వెంటనే.. శాస్త్రితో మాట్లాడుతూ.. మళ్లీ మిమ్మల్ని చూడటం చాలా బాగా అనిపిస్తుంది అని వ్యాఖ్యానించాడు.

ఆర్సీబీని ఓడించిన గ్రౌండ్ లోనే ఆడుతున్నందుకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇదే మైదానంలో రెండో గేమ్ ఆడుతున్నాం. అందరూ పాజిటివ్ గా ఉన్నారు. ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాం ఈ ఐపీఎల్ ఫైనల్ ఆడటానికి అని వివరించాడు.