IPL 2022: ఐపీఎల్‌లో కొత్త జట్లు తీసుకోబోయే ముగ్గురు ప్లేయర్లు ఎవరంటే?

రాబోయే ఐపీఎల్ సీజన్‌లో లక్నో, అహ్మదాబాద్ జట్లు కొత్తగా చేరుతున్నాయి.

IPL 2022: ఐపీఎల్‌లో కొత్త జట్లు తీసుకోబోయే ముగ్గురు ప్లేయర్లు ఎవరంటే?

Ipl

IPL 2022: రాబోయే ఐపీఎల్ సీజన్‌లో లక్నో, అహ్మదాబాద్ జట్లు కొత్తగా చేరుతున్నాయి. జనవరిలో జరగనున్న మెగా వేలానికి ముందు ఈ రెండు కొత్త జట్లు ముగ్గురు-ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది బీసీసీఐ. ఎందుకంటే పాత జట్లన్నీ 3-3 ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతి ఉంది. కొత్త జట్లకు అటువంటి అవకాశం లేదు, కాబట్టి 3-3 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఈ రెండు కొత్త జట్లు ఎవరిని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. లక్నో లిస్ట్‌లో కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో ఉన్నారు. సంజీవ్ గోయెంకా లక్నో జట్టును 7 వేల కోట్లకు కొనుగోలు చేశాడు. ఇటీవల, ఆండీ ఫ్లవర్ ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా.. గౌతమ్ గంభీర్ జట్టుకు మెంటార్‌గా నియమితులయ్యారు. డిసెంబర్ 31 లోపు, జట్టు ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది.

లక్నో ఫ్రాంచైజీతో కేఎల్ రాహుల్ చేరడం దాదాపు ఖాయం కాగా.. కేఎల్ రాహుల్ కోసం లక్నో 20 కోట్ల ఆఫర్ పెట్టినట్లు తెలుస్తుంది. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా జట్టులోకి రావచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిలుపుకోని ప్లేయర్ రషీద్ ఖాన్ సెకండ్ పర్సన్ కావచ్చు. ఇషాన్ కిషన్ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు.

అహ్మదాబాద్‌కు శ్రేయాస్ అయ్యర్.. వార్నర్, పాండ్యా:

CVC క్యాపిటల్ IPLలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని 5వేల కోట్లకు దక్కించుకుంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.., మెగా వేలానికి ముందు అహ్మదాబాద్ కొనుగోలు చేయాలని భావిస్తున్న ముగ్గురు ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

శ్రేయాస్ అయ్యర్ తన కెప్టెన్సీలో 7 సంవత్సరాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ను IPL ప్లేఆఫ్స్‌కు నడిపించాడు. అహ్మదాబాద్ అతనిని కెప్టెన్‌గా తన జట్టులోకి తీసుకోవచ్చు. ఐపీఎల్ చివరి సీజన్‌లో ఘోరంగా విఫలమైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీలో డేవిడ్ వార్నర్ చేరడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా వార్నర్ నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లో లేడు. ముంబై అతడిని రిటైన్ చేసుకోలేదు.