IPL 2022 Mega Auction: ఫ్రాంచైజీలో రిటెన్షన్ చేసుకోవాలంటే బడ్జెట్ రూల్స్‌ ఇవే

ఐపీఎల్ రాబోయే ఎడిషన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను యాడ్ చేయనున్నారు. ప్రస్తుతమున్న జట్లు ముగ్గురు నుంచి నలుగురు వరకూ ప్లేయర్లను జట్టులో ఉంచుకోవచ్చు. బీసీసీఐ సెట్ చేసిన నవంబర్30

IPL 2022 Mega Auction: ఐపీఎల్ రాబోయే ఎడిషన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను యాడ్ చేయనున్నారు. ప్రస్తుతమున్న జట్లు మాత్రం ముగ్గురు నుంచి నలుగురు వరకూ ప్లేయర్లను జట్టులో ఉంచుకోవచ్చు. మిగిలిన వారిని బీసీసీఐ సెట్ చేసిన గడువు తేదీ నవంబర్ 30లోగా ఫ్రాంచైజీలు కొత్త ప్లేయర్లను విడుదల చేయాల్సి ఉంది.

మెగా వేలానికి ముందు నలుగురు ప్లేయర్లను ఉంచుకునే ఫ్రాంచైజీ.. ఇద్దరు ఇండియన్ ప్లేయర్లను, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలి. జట్టు అవసరాన్ని బట్టి ఒక ప్లేయర్ ను మాత్రమే అట్టిపెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఆ ప్లేయర్లను జట్టులో ఉంచుకోవడం కూడా వారికి చెల్లించే డబ్బు ఆధారంగానే చేయాల్సి ఉంటుంది.

* నలుగురు ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే.. మొత్తంగా రూ.42కోట్లు (రూ.16కోట్లు, రూ.12కోట్లు, రూ.8కోట్లు, రూ.6కోట్లు)
* ముగ్గురు ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే.. మొత్తంగా 33 రూ.33కోట్లు (రూ.15కోట్లు, రూ.11కోట్లు, రూ.7కోట్లు)
* ఇద్దరు ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే.. మొత్తంగా రూ.22 కోట్లు (రూ.14కోట్లు, రూ.10కోట్లు)
* ఒక్కరిని మాత్రమే తీసుకోవాలనుకుంటే.. మొత్తంగా రూ.14కోట్లు (అన్ క్యాప్‌డ్ ప్లేయర్ అయితే రూ.4కోట్లు)

గతంలో పర్స్ వాల్యూ రూ.85కోట్లు ఉండగా దానిని రూ.5కోట్లు పెంచి రూ.90కోట్లకు చేసింది బీసీసీఐ. రాబోయే సీజన్లకు కచ్చితంగా ఫ్రాంచైజీల అకౌంట్ల నుంచే ప్లేయర్ల జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

…………………………………. : విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు కూలీలు మృతి

ఒక్కో ఫ్రాంచైజీ దగ్గర ఉండే మొత్తం;
* రిటెన్షన్ లేకపోతే.. రూ.90కోట్లు
* ఒక రిటెన్షన్ ఉంటే.. రూ.76కోట్లు
* రెండు రిటెన్షన్లు ఉంటే.. రూ.66కోట్లు
* మూడు రిటెన్షన్లు ఉంటే.. రూ.57కోట్లు
* నాలుగు రిటెన్షన్లు ఉంటే.. రూ.48కోట్లు

ట్రెండింగ్ వార్తలు