IPL 2022 Auction : కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్-2022 వేలం వాయిదా!

ఐపీఎల్-2022కు సంబంధించిన కీలక అంశం రిటెన్షన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.

IPL 2022 Auction : కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్-2022 వేలం వాయిదా!

Ipl 2022

IPL 2022 Auction Update: ఐపీఎల్-2022కు సంబంధించిన కీలక అంశం రిటెన్షన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. దీంతో, ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి అంతా మెగా వేలం(IPL Mega Auction)పై పడింది.

ఇది వరకు ఐపీఎల్ వేలం జనవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. అయితే, అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం కాకపోవడంతో అది కుదరలేదు. తర్వాత జనవరి చివరి వారంలో నిర్వహించొచ్చని వార్తలొచ్చాయి.

అయితే, ఇప్పుడు క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. 2022 మెగా వేలం వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వేలం ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఇందుకు వేదిక సైతం ఫైనలైజ్‌ అయినట్లు చెబుతున్నారు.

ఈసారి వేలాన్ని ముంబైలో కాకుండా దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లలో నిర్వహించాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ డిసైడ్‌ చేసింది. కరోనా కారణంగా మరోసారి పరిస్థితులు అదుపు తప్పుతాయేమో అనే ఆలోచనలు వస్తున్న క్రమంలో వేలానికి సంబంధించిన తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.