IPL 2022: అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నానంటోన్న మిచెల్ స్టార్క్

ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకుంటున్నందుకు గానూ కారణాలు వెల్లడించాడు ఆర్సీబీ ప్లేయర్. వేలంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకున్న ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్..

IPL 2022: అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నానంటోన్న మిచెల్ స్టార్క్

Mitchell Starc

IPL 2022: ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకుంటున్నందుకు గానూ కారణాలు వెల్లడించాడు ఆర్సీబీ ప్లేయర్. వేలంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకున్న ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్.. ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి తప్పుకోవడానికి కారణాలను తాజాగా వెల్లడిస్తూ.. కుటుంబానికి దూరంగా 22 వారాల పాటు బయో బబుల్‌లో గడపడం తన వల్ల కాదని చెప్పేశాడు.

అందుకే మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదని వివరణ ఇచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే తనకు దేశమే ముఖ్యమని, తొలి ప్రాధాన్యత ఎప్పటికీ ఆస్ట్రేలియాకేనంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2015లో చివరిసారిగా ఐపీఎల్‌లో ఆడిన స్టార్క్.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.4 కోట్లు వెచ్చించి దక్కించుకున్నప్పటికీ గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

ఆ త‌ర్వాత‌ నుంచి పలు కారణాలతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో స్టార్క్‌(ఆర్సీబీ తరఫున) 27 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. యాషెస్ సిరీస్‌లో స్టార్క్ సూపర్‌ ఫామ్‌లో ఉండి 5 టెస్ట్‌ల్లో 19 వికెట్లతో ఇంగ్లాండ్‌ వెన్నువిరిచాడు.

IPL 2022: ధోనీ వచ్చేశాడు.. సూపర్ కింగ్స్ సెటప్ రెడీ!