IPL 2022: మ్యాచ్ ఫిక్సింగా.. “రాజస్థాన్ స్కోరు అందుకే అలా”

ఫైనల్ మ్యాచ్ లో హోరాహోరీగా ఉండాల్సిన పోరు ఏకపక్షమైపోయింది. గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫలితంగా ఐపీఎల్ టైటిల్ దక్కించుకున్న జాబితాలో కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ చేరింది.

IPL 2022: మ్యాచ్ ఫిక్సింగా.. “రాజస్థాన్ స్కోరు అందుకే అలా”

Ipl2022 Title Winner Gujarat

IPL 2022: రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి రాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫైనల్ ఈవెంట్ వేడుకలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ విచ్చేశారు.

ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ లో హోరాహోరీగా ఉండాల్సిన పోరు ఏకపక్షమైపోయింది. గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫలితంగా ఐపీఎల్ టైటిల్ దక్కించుకున్న జాబితాలో కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ చేరింది.

మ్యాచ్ విన్నర్‌కు 20 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ, ట్రోఫీ అందించారు. రన్నరప్‌‌గా నిలిచిన పింక్ టీమ్‌ 13.5 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో సరిపెట్టుకుంది.

Read Also : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్‌లోనే కప్పు నెగ్గి చరిత్ర

సీజన్ ఆసాంతం దూకుడుతో ఆడిన జోస్ బట్లర్ ఈ మ్యాచ్ లో చతికిలబడ్డాడు. 35 బంతుల్లో 39 పరుగులు మాత్రమే చేశాడు. అప్పటికీ రాజస్థాన్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే టాప్ స్కోరర్. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగలిగింది.

గుజరాత్.. 18.1 ఓవర్‌లోనే టార్గెట్‌ను ఛేదించేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరవీర భయంకరమైన ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్ మ్యాచ్‌ను గెలిపించింది. నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3వికెట్లు పడగొట్టాడు. 30 బంతుల్లో 34 పరుగులు బాదేశాడు.

రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ మ్యాచ్‌లో లో-స్కోర్ చేయడం పట్ల అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనే ఆరోపణలతో సోషల్ మీడియా హీటెక్కింది. “రాజస్థాన్ స్కోరు అందుకే అలా” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే #Fixing అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.