IPL 2022: భారీ ధరతో కోల్‌కతాకు శ్రేయాస్.. పంజాబ్‌కు ధావన్.. గుజరాత్‌కు షమీ

బెంగళూరు జట్టు శ్రేయాస్ అయ్యర్ ను ఆల్రెడీ కొనేసిందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ కోల్ కతా కొనుగోలు చేసింది.

IPL 2022: బెంగళూరు జట్టు శ్రేయాస్ అయ్యర్ ను ఆల్రెడీ కొనేసిందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ కోల్ కతా కొనుగోలు చేసింది. వేలంలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రూ.12.25కోట్లకు అమ్ముడుపోయాడు. ముందుగా రూ.10కోట్ల వరకూ పలికిన ఢిల్లీ అక్కడితో ఆగిపోయింది.

ఇక టీమిండియా పేసర్ షమీను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. రూ.6.25 కోట్లకు గుజారత్ సొంతం చేసుకుంది. గతంలో కోల్ కతాకు, ఢిల్లీ, పంజాబ్ కు ఆడిన షమీ ప్రారంభ ధర రూ.2కోట్లతో వేలం మొదలైంది.

శిఖర్ ధావన్ ను పంజాబ్ జట్టు రూ.8.25కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ జట్టు మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ను రాజస్థాన్ రూ.5కోట్లకు కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.7.25కోట్లకు సొంతం చేసుకుంది.

Read Also: ట్రిపుల్‌ఆర్‌కు మరో సమస్య.. రిలీజ్ డేట్‌పై అనుమానాలు!

దక్షిణాప్రికా పేసర్ కగిసో రబాడను ఢిల్లీ క్యాపిటల్స్ వేలానికి వదిలిపెట్టేయగా పంజాబ్ కింగ్స్ రూ.9.25 కోట్లకు సొంతం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు