IPL 2022 : BCCI కీలక నిర్ణయం, మరో రెండు టీమ్‌లు

IPL 2022 : BCCI కీలక నిర్ణయం, మరో రెండు టీమ్‌లు

IPL 2022 to be a 10-team : IPL 2022 సీజన్ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు మరో రెండు టీమ్‌లను అదనంగా చేర్చింది. మొత్తం 10 జట్లు మెగాటోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం అహ్మదాబాద్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. IPL చరిత్రలో 2011, 2012, 2013 మినహా..ఇంతవరకు ఏ సీజన్‌లోనూ 9 కంటే ఎక్కువ జట్లు బరిలోకి దిగలేదు. 2022లో 10 జట్లు, 94 మ్యాచ్‌లతో బిగ్ టోర్నమెంట్ చూడవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

గత నెలలో ఐపీఎల్ (Indian Premier League (IPL) 2020కి ఎండ్ కార్డు పడింది. అప్పటి నుంచి వచ్చే సీజన్‌లో 10 జట్లను ఆడిస్తారనే ప్రచారం జరిగింది. వచ్చే సంవత్సరం ఐపీఎల్‌కు చాలా తక్కువ సమయం ఉండడంతో టెండరింగ్ ప్రక్రియ, మెగా వేలం నిర్వహించడం కష్టతరమని బీసీసీఐ భావించిందని తెలుస్తోంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 8 టీంలతో నిర్వహించి..2022 సీజన్‌ను మాత్రం 10 జట్లతో నిర్వహించాలని బీసీసీఐ (BCCI) భావిస్తోంది.

కరోనా కాలంలో..బీసీసీఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 13 సీజన్ పూర్తయ్యాయి. ఆలస్యంగా ప్రారంభమైనా..క్రికెట్ ప్రేమికులు ఎంతో మజా ఆస్వాదించారు. యూఏఈ వేదికగా జరిగిన మెగాటోర్నీలో ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో టీ 20 ఫార్మాట్‌లో క్రికెట్‌ను చేర్చాలన్న ఐసీసీ (ICC) నిర్ణయానికి బీసీసీఐ మద్దతు తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తక్ ఆలీ టోర్నీ ద్వారా దేశవాళీ క్రికెట్‌ ప్రారంభమౌతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే.